Viral Video: హాలీవుడ్‌ సినిమాను తలపించిన పక్షుల విన్యాసం.. రొమాంటిక్ సీన్ చూస్తే మైమరిచిపోవాల్సిందే..

Birds Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిలో

Viral Video: హాలీవుడ్‌ సినిమాను తలపించిన పక్షుల విన్యాసం.. రొమాంటిక్ సీన్ చూస్తే మైమరిచిపోవాల్సిందే..
Birds

Updated on: Mar 15, 2022 | 9:21 AM

Birds Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిలో పక్షులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉంటాయి. పక్షుల విన్యాసాలు, అదేవిధంగా డేగల వేటకు సంబంధించినవి ఉంటాయి. తాజాగా పక్షుల విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఆకాశంలో ఎగిరే పక్షులంటే అందరికీ ఇష్టం ఉంటుంది. పక్షులన్నీ కలిసి అనేక రకాల ఆకృతుల్లో కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ రోజు అలాంటి ఒక వీడియో (social media) ఒకటి బాగా వైరల్ అవుతోంది. కానీ ఇలాంటి వీడియోను మీరు ఎప్పుడూ కూడా చూసుండరు. ఎందుకంటే.. హాలీవుడ్ సినిమా తరహాలో.. ఒక పక్షి మరో పక్షిపై స్వారీ చేస్తూ స్కై రైడ్‌ని ఎంజాయ్ చేశాయి.

ఈ వైరల్ వీడియోలో.. ఒక పక్షిపై మరొక పక్షి స్వారీ చేస్తూ ఆకాశంలో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఇది చూసి అందరూ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోను చూసిన యూజర్లు షేర్ చూస్తూ.. ఇలాంటి దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో..

వీడియోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 50 వేల మందికి పైగా వీక్షించారు.

Also Read:

Viral Video: ఇదేం పిచ్చి ఆనందం.. టాటూ క్రేజ్‌లో పడి యువతి చేసిన పనికి అంతా షాక్.. వీడియో

Viral Video: మహిళ ప్రాణాలు కాపాడిన హెల్మెట్‌.. లారీ ఢీకొని ఎగిరిపడ్డా మృత్యువు నుంచి ఎలా తప్పించుకుందో మీరే చూడండి..