భలే మంచి ఉద్యోగం..! నెలకి కోటి రూపాయల జీతం.. కేవలం కుక్కను చూసుకుంటే చాలు.. కండీషన్స్ అప్లై..

|

Jun 24, 2023 | 9:57 PM

కేవలం కుక్కను చూసుకుంటే చాలు నెలకు ఒక కోటి రూపాయల జీతం ఇస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇప్పటికే 300 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒక వ్యక్తిని వారు ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించిన ప్రకటన ఆన్‌లైన్‌లో విడుదలైంది. దీనికి ఇచ్చే జీతం అత్యంత ఎక్కువగా ఉన్నందున ప్రజల నుంచి విస్తృత స్పందన వస్తోంది.

భలే మంచి ఉద్యోగం..! నెలకి కోటి రూపాయల జీతం.. కేవలం కుక్కను చూసుకుంటే చాలు.. కండీషన్స్ అప్లై..
Billionaire Family Dog
Follow us on

ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలు ఆసక్తికరంగా ఉంటాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు రోజంతా టీవీ చూడటం, పని చేయడానికి గంటల తరబడి క్యూలలో నిలబడటం, సూట్‌తో తిరుగుతూ డబ్బు సంపాదించడం గురించి విన్నారు. ఇలాంటి కొన్ని వింత ఉద్యోగాలకు లక్షలు, కోట్లు జీతం ఫిక్స్ చేస్తారు. ఇది కూడా అలాంటిదే విచిత్రమైన పని. కేవలం కుక్కను చూసుకుంటే చాలు నెలకు 1 కోటి రూపాయల జీతం ఇస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేవలం కుక్కను చూసుకుంటే చాలు నెలకు ఒక కోటి రూపాయల జీతం ఇస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అమెరికాకు చెందిన ఓ సంపన్న కుటుంబం ఈ ఉద్యోగ ఆఫర్‌ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన ఒక సంపన్న కుటుంబం.. తమ ఇంట్లో నాన్సీ అనే కుక్కను పెంచుకుంటున్నారు. దానిని చూసుకోవడం వారికి కష్టంగా మారింది.. అందువల్ల వారి కుక్కను చూసుకునేందుకు గానూ వారు ఒక ఉద్యోగి కావాలని ప్రకటన ఇచ్చారు. కుక్క పూర్తి ఆహారపు అలవాట్లు తెలిసిన వారు, కుక్క కాలిగోరు నుంచి దాని పూర్తి ఆరోగ్యం, దాని వెంట్రుకల వరకు కుక్క గురించి అన్ని తెలిసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 300 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒక వ్యక్తిని వారు ఎంపిక చేస్తారు. అయితే దానికి ఎంపికైన వారు తమ వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాల్సిందేనని అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఆన్‌లైన్‌లో విడుదలైంది. ఉద్యోగం కోసం నియమించిన వ్యక్తి కుక్కలను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉద్యోగం కేవలం కుక్క సంరక్షణ మాత్రమే.. సంవత్సరానికి ఆరు రోజులు మాత్రమే సెలవు. అసైన్‌మెంట్‌లో ఉన్న వ్యక్తి కుక్క అన్ని ఉద్యోగ అవసరాలను తీర్చాలి. అతను/ఆమె సెంట్రల్ లండన్‌లోని నైట్స్‌బ్రిడ్జ్‌లో కుక్క యజమాని కుటుంబంతో కలిసి జీవించాలి. అయితే కుటుంబ సమేతంగా ప్రయాణం చేసినప్పుడల్లా ఆ ఉద్యోగి కూడా పెంపుడు కుక్కతో పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది. కుక్కలకు ఆహార సామాగ్రి, వెట్ అపాయింట్‌మెంట్‌లు, వాటి ఆరోగ్యం గురించి వివరణాత్మక రికార్డులను ఉంచాలని చెప్పారు. ఈ అవసరాలన్నీ కాకుండా, ఉద్యోగానికి సంవత్సరానికి ఆరు వారాల సెలవులు ఉన్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నివేధిక ప్రకారం… ఏజెన్సీ డాగ్-సిట్టర్ ఉద్యోగాన్ని పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. వారు ఈ ఉద్యోగ ప్రకటనను పోస్ట్ చేసిన తర్వాత, పోస్ట్‌కి ఇప్పటికే దాదాపు 400 మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులు వచ్చాయి. తొలిసారిగా ఈ తరహా జాబ్ ఆఫర్ ఇచ్చాం. దీనికి ఇచ్చే జీతం అత్యంత ఎక్కువగా ఉన్నందున ప్రజల నుంచి విస్తృత స్పందన వస్తోంది అని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..