Watch: అయ్యోపాపం..స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి..!

|

Dec 16, 2024 | 3:49 PM

అతడు స్కూల్ కు వెళ్తుండగా కొంత మంది వ్యక్తులు రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చి అతడిని అడ్డుకున్నారు. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి అతడిని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ గుంజన్ అనే మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Watch: అయ్యోపాపం..స్కూల్ కు వెళ్తున్న టీచర్ ను కిడ్నాప్ చేశారు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి..!
Bihar Teacher Kidnapped
Follow us on

ఉదయాన్నే స్కూల్‌కి వెళ్తున్న ఓ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. రోజూ మాదిరిగానే స్కూల్‌కి వెళ్తున్న టీచర్‌ని కొందరు వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. తుపాకులతో బెదిరించి సమీపంలోని ఓ గుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే పెళ్లికూతురుగా ముస్తాబులో ఉన్న ఓ మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. ఈ షాకింగ్‌ ఘటన బిహార్‌లోని కితహార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని బేగుర్ సరాయ్ జిల్లాలో నిరాజౌరాకి చెందిన అవ్నీష్ కుమార్ ఇటీవల బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. అతడు కతిహార్ జిల్లా మిడిల్ స్కూల్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. 13 డిసెంబర్‌ శుక్రవారం రోజున అతడు స్కూల్ కు వెళ్తుండగా కొంత మంది వ్యక్తులు రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చి అతడిని అడ్డుకున్నారు. గన్స్ తో బెదిరించి కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి అతడిని ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ గుంజన్ అనే మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు. బలవంతంగా వివాహం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో అతడు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. అయిన్నప్పటికీ అవ్నీష్ వివాహ ఆచారాలను పూర్తి చేయవలసి వచ్చింది. అయితే, గతంలో పెళ్లి కూతుగెటప్‌లో ఉన్న మహిళ, అవ్నీష్ ప్రేమించుకున్నారని, కలిసే ఉన్నారని పెళ్లి కూతురు, ఆమె బంధువులు ఆరోపించారు. కానీ, అవ్నీష్‌ వారి మాటలు ఖండించాడు. తనకు సదరు పెళ్లికూతురికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తనకు ప్రభుత్వం రావటంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించాడు. తను వివాహానికి అంగీకరించలేదని గట్టిగా అరుస్తూ చెప్పటం కూడా వీడియోలో కనిపించింది. అయితే, విషయం పోలీస్‌ స్టేషన్‌కి చేరింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరువురిని విచారిస్తున్నట్టుగా సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి