
రీల్స్ కోసం తన తండ్రి ఓ కూతురు పార్శిల్ కట్టి కొరియర్ చేసిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని ఒక కొరియర్ ఆఫీస్‌కు నిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వచ్చారు. ఒక పెద్ద మూటను పార్శిల్ చేశారు. ఈ మూటను కొరియర్ చేయాలన్నారు. అయితే, ఆ మూటలో ఏముందంటూ కొరియర్ ఆఫీస్ సిబ్బంది అడిగితే, జవాబు చెప్పలేదు. అనుమానం వచ్చిన కొరియర్ సిబ్బంది- ఆ మూటను విప్పి చూడగా అందులో ఒక వృద్ధుడు కనిపించాడు. అది చూసిన స్టాఫ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే అతను ఎవరు అని ఆరా తీయగా.. ఆ పార్సిల్ తీసుకొచ్చిన యువతి తండ్రి ఆయన అని తెలిసింది. బాక్స్ ఓపెన్ చేయగానే ఆయన ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. బస్తాలో కుక్కేయడం వల్ల ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతన్టటు వీడియోలో చూడవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చేశారని సిబ్బంది వారి కుటుంబ సభ్యులను అడగగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం అని ఆ కుటుంబీకులు సమాధానం చెప్పారు.
ఇదంతా ఎందుకు అని మళ్లీ అడిగితే, అసలు ఉద్దేశం చెప్పారు. ఉగాది, రంజాన్ వంటి పండగల సీజన్‌లో మనుషులు ప్రయాణించడం కన్నా, పార్శిళ్లు పంపడం ఈజీ అని చెప్పడమే తమ ఉద్దేశమంటూ ఆ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ ఉదంతంపై కొరియర్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ బాధ్యతా రాహిత్యంపై ఆ కుటుంబం చివరకు సారీ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొరియర్ సంస్థకు చెందిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో ఇది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది.
వీడియో చూడండి..
We live in a weird weird world. Daughter & family pack father in a gunny bag,take him to a courier office,ask staff to send parcel out of Bengaluru, all this for a reel showing it’s easier to courier a man than get bus & train tickets this festive season. Land in police station. pic.twitter.com/ROz2SWjFpT
— Deepak Bopanna (@dpkBopanna) March 17, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.