రూ. 49కే 4 డజన్ల గుడ్లు.. ఆఫర్‌కు టెంప్ట్‌ అయితే రూ. 50 వేలు పోయాయి

బెంగళూరుకు చెందిన ఓ మహిళకు ఈమెయిల్‌కు ఓ మెయిల్ వచ్చింది. కేవలం రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అంటూ ఓ ప్రకటన వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఈ ఆఫర్‌ అందిస్తున్నట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఆఫర్ చూడగానే టెంప్ట్‌ అయిన మహిళ వెంటనే ఆ లింక్‌ను క్లిక్‌ చేసింది. అనంతరం క్రెడిట్ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డుతో...

రూ. 49కే 4 డజన్ల గుడ్లు.. ఆఫర్‌కు టెంప్ట్‌ అయితే రూ. 50 వేలు పోయాయి
Cyber Fraud

Updated on: Feb 26, 2024 | 7:05 PM

ప్రస్తుతం ఏ చిన్న అవసరానికైనా ఆన్‌లైన్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద వస్తువుల నుంచి నిత్యవసర వస్తువుల వరకు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. అయితే రోజురోజుకీ విస్తరిస్తున్న ఇంటర్నెట్‌తో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాల కారణంగా డబ్బులు కోల్పోతున్న వారు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు రోజుకోటి జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఉలిక్కి పడేలా చేసింది.

బెంగళూరుకు చెందిన ఓ మహిళకు ఈమెయిల్‌కు ఓ మెయిల్ వచ్చింది. కేవలం రూ. 49కే 4 డజన్ల కోడి గుడ్లు అంటూ ఓ ప్రకటన వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఈ ఆఫర్‌ అందిస్తున్నట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో ఆఫర్ చూడగానే టెంప్ట్‌ అయిన మహిళ వెంటనే ఆ లింక్‌ను క్లిక్‌ చేసింది. అనంతరం క్రెడిట్ కార్డ్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేయాలని అందులో సూచించారు. దీంతో మహిళ క్రెడిట్‌ కార్డు వివరాలను ఎంటర్‌ చేసింది.

వెంటనే రిజిస్టర్‌ ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వచ్చింది. అయితే ఓటీపీ ఎంటర్‌ చేయకముందే మహిళ ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయి. అయితే అందులో పేర్కొన్నట్లు రూ. 49 కాకుండా క్రెడిట్‌ కార్డ్‌ నుంచి ఏకంగా రూ. 48,199 డెబిట్ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. క్రెడిట్ కార్డ్ నుంచి షైన్ మొబైల్ హెచ్‌యు అనే ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు హిస్టరీలో తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో వెంటనే మహిళ ఖాతాను బ్లాక్‌ చేశారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ ద్వారా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన మొత్తం వివరించి ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసపూరిత ఆఫర్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..