మెట్రో స్టేషన్‌లో షాకింగ్‌ సీన్.. నిద్రమత్తులో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే..

అనుకోకుండా డ్యూటీలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు మెట్రో ట్రాక్‌లపై పడియాడు. అయితే, ఓవర్ టైమ్ డ్యూటీ చేయడంతోనే అతడు అలసటతో నిద్రమత్తులోకి వెళ్లాడని అధికారులు గుర్తించారు. కాగా, ఈ సంఘటన మొత్తం CCTV ఫుటేజ్‌లో రికార్డైంది. ఆ వెంటనే వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను చూసి షాక్ అవుతారు. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

మెట్రో స్టేషన్‌లో షాకింగ్‌ సీన్.. నిద్రమత్తులో ట్రాక్‌పై పడిపోయిన సెక్యూరిటీ గార్డు.. క్షణాల్లోనే..
Metro Security Guard

Updated on: Aug 26, 2025 | 9:02 PM

మెట్రో స్టేషన్ పట్టాలపై పడిపోవడం చాలా ప్రమాదకరమైన సంఘటన. ఎందుకంటే మెట్రో ట్రాక్‌పై ఎప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో దానిపై పడినవారు దాదాపుగా మరణించే ప్రమాదం ఉంది. అలాంటి హృదయ విదారక సంఘటన బెంగళూరు నుండి వెలుగులోకి వచ్చింది. అనుకోకుండా డ్యూటీలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు మెట్రో ట్రాక్‌లపై పడియాడు. అయితే, ఓవర్ టైమ్ డ్యూటీ చేయడంతోనే అతడు అలసటతో నిద్రమత్తులోకి వెళ్లాడని అధికారులు గుర్తించారు. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో ఇలాంటి షాకింగ్ ఘటన జరిగింది. రాగిగూడ మెట్రో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు నిద్ర మత్తులో ట్రాక్‌పై పడిపోయాడు. అయితే వెంటనే తేరుకుని ప్లాట్‌ఫామ్‌‌పైకి ఎక్కే ప్రయత్నం చేయగా, ఓ ప్రయాణికుడు గమనించి అతడిని పైకి లాగాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆగస్టు 25న ఉదయం 11:10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఓవర్ టైమ్ డ్యూటీ చేయడంతోనే అతడు అలసటతో నిద్రమత్తులోకి వెళ్లాడని అధికారులు గుర్తించారు. కానీ అదృష్టవశాత్తూ, ఎటువంటి పెద్ద ప్రమాదం జరగలేదు. అతను తృటిలో తప్పించుకున్నాడు. కాగా, ఈ సంఘటన మొత్తం CCTV ఫుటేజ్‌లో రికార్డైంది. ఆ వెంటనే వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను చూసి షాక్ అవుతారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ప్లాట్‌ఫామ్ నంబర్ 1లో డ్యూటీలో ఉన్న మరో సెక్యూరిటీ గార్డు వెంటనే అత్యవసర ట్రిప్ స్విచ్ (ETS)ను యాక్టివేట్ చేశాడు. దీని కారణంగా ట్రాక్ విద్యుత్ సరఫరా నిలిపివేయబడిందని తెలిసింది. ఈ సంఘటన సమయంలో స్టేషన్‌కు వస్తున్న రైలును నిలిపివేశారు. భద్రత కోసం దాదాపు 6 నిమిషాల పాటు సర్వీసులను నిలిపివేశారు. 52 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు ఎటువంటి గాయాలు కాలేదు. అతను సురక్షితంగా ఉన్నాడని మెట్రో సిబ్బంది తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..