Viral Video: 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణం నిలిపిన డాక్టర్.. చేతులెత్తి దండం పెట్టకుండా ఉంటారా..?

|

Sep 12, 2022 | 1:28 PM

ట్రాఫిక్‌లో చిక్కుకున్న డాక్టర్.. ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించి.. రోగి ప్రాణాలు నిలిపేందుకు ఏకంగా 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లారు.

Viral Video: 3 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణం నిలిపిన డాక్టర్.. చేతులెత్తి దండం పెట్టకుండా ఉంటారా..?
Doctor Good Heart
Follow us on

Trending: బెంగుళూరు(Bengaluru)లో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొద్ది దూరం ప్రయాణించడానికి కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అక్కడివారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకు తోడు ప్రజంట్ వానలు, వరదలు కారణంగా ప్రయాణాలు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉన్న ఓ డాక్టర్ కూడా అలానే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో ఆయన చేసిన పనికి ఇప్పుడు అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఆ డీటేల్స్ ఏంటో చూద్దాం పదండి. మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ అయిన డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న అత్యవసర లాపరోస్కోపిక్ గాల్ బ్లాడర్‌ శస్త్రచికిత్స చేసేందుకు వెళుతుండగా సర్జాపూర్-మారాతల్లి మార్గంలో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఆలస్యమైతే  రోగికి ప్రాణానికి హాని కలుగుతుందని భావించారు. దీంతో కార్ డోర్ తీసి పరిగెత్తడం స్టార్ట్స్ చేశారు. అలా మూడు కిలోమీటర్లు పరిగెత్తి.. సమయానికి ఆస్పత్రికి చేరుకుని..  కీలకమైన శస్త్ర చికిత్స చేశారు.

తాను ప్రతిరోజు సెంట్రల్ బెంగుళూరు నుంచి సర్జాపూర్‌లో గల మణిపాల్ హాస్పిటల్స్‌కు ప్రయాణిస్తానని డాక్టర్ గోవింద్ నందకుమార్ తెలిపారు. తాను ఆపరేషన్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఎర్లీగానే బయలుదేరినా.. అధిక ట్రాఫిక్‌ కారణంగా స్ట్రక్ అయినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు సమయం పట్టేలా ఉండటంతో.. కారు డ్రైవర్‌కు ఇచ్చేసి.. తాను పరిగెత్తుకుంటూ ఆస్పత్రికి వచ్చినట్లు వివరించారు. అప్పటికే మహిళా రోగికి అనస్థీషియా ఇచ్చి.. మిగతా టీమ్‌ అంత రెడీగా ఉందని.. తాను రాగానే ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు నందకుమార్ చెప్పారు. ఫైనల్‌గా శస్త్రచికిత్స విజయవంతమైంది. సదరు రోగిని కూడా డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆ డాక్టర్ వృత్తి నిర్వహణ, అంకిత భావంపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి