Viral Video: టీచర్‌ వీడ్కోలు వేడుకలో విద్యార్థుల హల్‌చల్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

కానీ, ఈ వీడియోను నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో కళాశాల నుండి పదవీ విరమణ చేస్తున్న ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేకమైన వీడ్కోలు. ఇది ఆ టీచర్‌ని భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: టీచర్‌ వీడ్కోలు వేడుకలో విద్యార్థుల హల్‌చల్‌.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Heartwarming Farewell

Updated on: Mar 27, 2025 | 9:48 PM

సోషల్ మీడియాలో మనం ప్రతిరోజూ అనేక అందమైన, ఆశ్చర్యకరమైన వీడియోలను చూస్తుంటాము. అలాంటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రజల హృదయాల్ని హత్తుకునేలా కనిపించింది. బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం తమ క్లాస్ టీచర్‌పై చేసిన చిలిపి పని ఇది. కానీ, ఈ వీడియోను నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో కళాశాల నుండి పదవీ విరమణ చేస్తున్న ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేకమైన వీడ్కోలు. ఇది ఆ టీచర్‌ని భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోను మోన్సి అనే విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను 4 మిలియన్లకు పైగా వీక్షించారు. కాగా, వైరల్‌ వీడియోలో విద్యార్థులు తమలో తాము పోట్లాడుకుంటున్నట్లు నటిస్తారు. బాధలో ఉన్న ఉపాధ్యాయుడు జోక్యం చేసుకుని విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు, విద్యార్థులు ఉపాధ్యాయుడి చుట్టూ నిలబడి, చప్పట్లు కొడుతూ కనిపిస్తారు. అంతలోనే మరికొందరు స్టూడెంట్స్ అక్కడకు కేక్ తీసుకురావడం చూడవచ్చు. అప్పుడుగానీ, ఆ గురువుకు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఆ తరువాత, టీచర్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నుండి తీసినట్లు తెలిసింది. ఆ వీడియోపై చాలా మంది కామెంట్లు చేశారు. ఏది ఏమైనా, వీడియో చూస్తుంటే విద్యార్థులు తమ అభిమాన గురువుకు చిరస్మరణీయమైన వీడ్కోలు పలికినట్లు అనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..