Viral Video: పార్క్ చేసిన కారు నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్

|

Jul 10, 2024 | 11:00 AM

ఇది వర్షాకాలం.. సరీసృపాలే కాదు.. క్రూర మృగాలు కూడా అప్పుడప్పుడూ తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి.

Viral Video: పార్క్ చేసిన కారు నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేయగా మైండ్ బ్లాంక్
Viral Video
Follow us on

ఇది వర్షాకాలం.. సరీసృపాలే కాదు.. క్రూర మృగాలు కూడా అప్పుడప్పుడూ తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. ఆ కోవకు చెందిన వీడియోనే ఇది. ఇందులో ఓ యువతి తన ఇంటి ముందు కారును పార్క్ చేసి ఉండగా.. లోపల నుంచి ఏవో వింత శబ్దాలు రావడం మొదలువుతాయి. డోర్ తీసి చూడగా.. లోపల దృశ్యం చూసి దెబ్బకు షాక్ అయ్యింది.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి తన ఇంటి లోపల నుంచి పండ్ల బాక్స్ తీసుకుని.. బయట ఉన్న పార్క్‌ చేసిన కారులో పెట్టడానికి వెళ్తుంది. ఆ సమయంలో కారులో నుంచి వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఏంటా అని డోర్ తీసి చూడగా.. అందులో ఓ ఎలుగుబంటి తిష్ట వేసుకుని కూర్చుంది. బయటకు రానే.. రాను అన్నట్టుగా లోపలే కూర్చుంది. ఇక ఆ ఎలుగుబంటిని చూడగా.. సదరు యువతి తన దగ్గరున్న పండ్ల బాక్స్‌ను కింద పడేసి.. పరుగున ఇంట్లోకి పారిపోతుంది.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

కాగా, బయటకొచ్చిన ఎలుగుబంటి అటూ.. ఇటూ చూసి కిందపడ్డ పండ్లను తినే ప్రయత్నం చేస్తుంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి