గబ్బిళాలను పూజించి వాటి మలంతో పిల్లలకు వ్యాధులు రాకుండా స్నానాలు చేయించడం.. ఎక్కడో తెలుసా..?

| Edited By: Jyothi Gadda

Oct 20, 2023 | 10:32 AM

ఆ పక్షులకి ఎటువంటి హాని జరగకుండా తమ గ్రామస్థులు రక్షణ గా వుంటారు. అక్కడి ప్రజలు ఆ గబ్బిలాలను అపశఖునంగా కాదు, కదా సాక్షాత్తు దేవత పక్షులే తమ గ్రామం లో కొలువు తీరాయాని నిత్యం పూజలు చేస్తుంటారు అక్కడి గ్రామస్థులు. అంతే కాకా ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ గబ్బిలాల మలం తో వారి పిల్లలకు స్నానం చేపిస్తే పక్షి దోషాలు తొలగి ఆరోగ్యంగా వుంటారు అని నమ్ముతుంటారు.

గబ్బిళాలను పూజించి వాటి మలంతో పిల్లలకు వ్యాధులు రాకుండా స్నానాలు చేయించడం.. ఎక్కడో తెలుసా..?
Bats
Follow us on

కడప జిల్లా, అక్టోబర్20; గబ్బిలాలు ఆ పేరు వినగానే ఏదో భయం కలుగుతుంది .. అప శఖునంగా భావిస్తారు. వాటిని చూసినా, అవి చేసే శబ్దాలు విన్నా ఎంతో జుబుత్సాకరం గా ఉంటుంది. ఒకటి రెండు గబ్బిలాలు చేసే శబ్దాలకే పిల్లలు దడుచుకుంటారు. అటువంటిది వేల గబ్బిలాలు ఒక్క చోట చేరితే ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లాలన్నా కనీసం చూడాలన్నా వెన్ను లో వణుకుపుట్టడం ఖాయం. అయితే కడప జిల్లా రైల్వే కోడూరు మండలం మాధవరం పోడు గ్రామం లో మాత్రం దీనికి అంత బిన్నం గా ఉంటుంది.

హిందు సాంప్రదాయం ప్రకారం చింత చెట్టు అన్నా, గబ్బిలాలు అన్నా అరిష్టం అంటారు. చింతచెట్టుకు శివ పూజలు ఏల అని అంటారు. అయితే ఆ గ్రామస్థులు మాత్రం నిత్యం ఆ గబ్బిలాలకు అవి వున్న చింత చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. ఆచెట్టుపై ఉండే గబ్బిలాల మలం తో పిల్లలకు స్నానం చేయిస్తారు. వాటి శబ్దాలనే మంచి శకునంలా భావిస్తారు, అవి ఉండడం వల్లే తమ గ్రామం పాడి పంటలతో పచ్చని పొలాలతో ఎంతో సుభిక్షంగా వుంది అని నమ్ముతారు. గతంలో మాధవరం పోడు గ్రామంలో ఉన్న ఈ గబ్బిళాలు తమ గ్రామాన్ని వదిలిపోవడం వల్ల దరిద్రం పట్టుకుందని ఇప్పటికీ బాధ పడుతుంటారు ..

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం లోని మాధవరం పోడు అనే గ్రామం వుంది ఇక్కడ దాదాపు 450 కుటుంబాలు నివసిస్తుంటారు. ఆ ఉరి మధ్యలో వున్న చింత చెట్లకు వేలాది గబ్బిలాలు వేలాడుతూ నిత్యం శబ్దాలు చేస్తూ ఉంటాయి. అవి ఉండడం ఎంతో అదృష్టమని అవి తమ గ్రామానికి రావడం వల్లే వారి ఊరు సుభిక్షంగా ఉంగది .. గతంలో తమ ఊరిలో వున్న గొడవలు, కొట్లాటలు, రభసలు పోయి తమ గ్రామం ఇప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా పచ్చని పంట పొలాలతో ఎంతో అభివృద్ధి చెంది సుభిక్షం గా వుంది అని నమ్ముతారు ఆ గ్రామస్థులు. ఆ పక్షులకి ఎటువంటి హాని జరగకుండా తమ గ్రామస్థులు రక్షణ గా వుంటారు. అక్కడి ప్రజలు ఆ గబ్బిలాలను అపశఖునంగా కాదు, కదా సాక్షాత్తు దేవత పక్షులే తమ గ్రామం లో కొలువు తీరాయాని నిత్యం పూజలు చేస్తుంటారు అక్కడి గ్రామస్థులు. అంతే కాకా ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ గబ్బిలాల మలం తో వారి పిల్లలకు స్నానం చేపిస్తే పక్షి దోషాలు తొలగి ఆరోగ్యంగా వుంటారు అని నమ్ముతుంటారు.

ఇవి కూడా చదవండి

ఇది ఇలా ఉంటే కోడూరు మండలం కి చెందిన గంగు రాజుపోడు గ్రామస్థులు మాత్రం గతంలో తమ గ్రామం లో ఉన్న గబ్బిళాలు.. ఇప్పుడు పక్క గ్రామానికి తరలివెళ్ళి పోవడంతో మళ్ళీ తమ గ్రామం గతంలోలా గొడవలు , పంటలు పండకపోవడం వలన మళ్ళీ తమ గ్రామం పాలిట శాపం గా మారిందని అంటున్నారు మాదవరం పోడు లో ఉన్న గబ్బిలాలు మొదట తమ గ్రామం లోనే ఉండేవి అని అయితే వేటగాళ్లు వచ్చి గబ్బిలాలను చంపితినడం వల్ల అవి పక్క గ్రామం లోకి వెళ్లిపోయాయని, అప్పటినుండి వారి గ్రామం లో సరిగ్గా పంటలు పండడం లేదు అని, గొడవలు కొట్లాటలతో గ్రామా పూర్తిగా నాశనం అయిపోయింది అని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..