Viral Video: చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో

నిజమే.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చెప్పినట్లు.. ప్రేమను పొందడంతో 'నాన్న' బాగా వెనకబడిపోయాడు. అమ్మకు ఇచ్చిన ఇంపార్టెన్స్..

Viral Video: చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో
Father Son Cute Video

Updated on: Mar 29, 2021 | 6:11 PM

నిజమే.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చెప్పినట్లు.. ప్రేమను పొందడంతో ‘నాన్న’ బాగా వెనకబడిపోయాడు. అమ్మకు ఇచ్చిన ఇంపార్టెన్స్ నాన్నకు దక్కడం లేదన్నది వాస్తవం. ఒక్కసారి ఆలోచించుకుంటే మన మనసే ఈ విషయం చెబుతుంది. నవమాసాలు మోసి, కని.. గోరుముద్దలు పెట్టి పెంచిన అమ్మను మించిన ఎమోషన్ మనకు ఉండదు నిజమే. కానీ ఆ గోరుముద్దులు తీసుకొచ్చేది నాన్న, మన కాళ్లపై మనం నిలబడేవరకు మన బాధ్యతలు చూసేది నాన్న. కానీ ఆయనపై మనకు ఎంతో ప్రేమ ఉన్న.. ఆ స్థాయిలో ప్రేమను చూపించలేం. కాగా నాన్న పిల్లల విషయంలో ఎంత ఎమోషనల్‌గా ఉంటారో చెప్పే వీడియోని మీ కోసం తీసుకొచ్చాం.

ఒక బుడతడు అంబాడటం ఆపి మొదటిసారి తనకు తానుగా నడుస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. చిన్నోడు బుజ్జి, బుజ్జి పాదాలతో బుడి, బుడి అడుగులు వేయడం చూసిన తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. అతడి కళ్లళ్లో ఒక్కసారిగా ఆనందంతో కూడిన నీటి చెమ్మ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల మనసును తాకుతుంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని చూసిన చాలా మంది తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ‘తల్లిదండ్రులు ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు. ఈ వీడియో పాతది అయినప్పటికీ ప్రస్తుతం మరోసారి ట్రెండ్ అవుతుంది.

Also Read: మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి.. అదే వారి ప్రాణాలు తీసింది

ఏపీలో తాజా కరోనా బులిటెన్ విడుదల.. ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

Follow Us