Viral Video: మంచు కురిసే వేళలో.. తెగ ఎంజాయ్‌ చేసిన పిల్ల ఎలుగుబంటి.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వీడియో

|

Oct 05, 2021 | 1:02 PM

Baby Bear Viral Video: సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని నవ్వుకునేలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఇంటర్నెట్

Viral Video: మంచు కురిసే వేళలో.. తెగ ఎంజాయ్‌ చేసిన పిల్ల ఎలుగుబంటి.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వీడియో
Bear
Follow us on

Baby Bear Viral Video: సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని నవ్వుకునేలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఇంటర్నెట్ ప్రపంచంలో.. ఇటీవల కొన్ని జంతువుల ఫన్నీ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోల్లో ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మంచు కురుస్తున్న సమయంలో ఓ బుజ్జి ఎలుగుబంటి డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో మంచు కురుస్తున్న సమయంలో ఓ పెద్ద ఎలుగుబంటి వెంట నడుస్తున్న పిల్ల ఎలుగుబంటి ఒక్కసారిగా ఆగి.. మంచు బిందువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయండి..

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. ఎలుగుబంటి దాని పిల్ల నిర్మానుష్యంగా ఉన్న ఓ భవన పార్కింగ్ స్థలం గుండా వెళుతున్నాయి. ఈ క్రమంలో మంచు బాగా కురుస్తోంది. తల్లి వెంట నడుస్తున్న పిల్ల ఎలుగుబంటి ఒక్కసారిగా ఆగి.. హిమపాతాన్ని ఆస్వాదిస్తుంది. తన రెండు కాళ్లను పైకి మంచు బిందువులను పట్టుకునేలా స్టేప్పులేస్తుంది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎలుగుబంటి పిల్ల ప్రకృతి ఎంజాయ్‌ చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. హిమపాతాన్ని ఎవరూ ఆస్వాదించలేనంతగా.. విహరిస్తుందని.. మంచిగా స్టేప్పులేస్తుందంంటూ కామెంట్లు చేస్తున్నారు.
వీడియో..

Also Read:

Viral Video: కారు వేగంగా వెళ్తుండగా బానట్‌పై పడిన పాము.. బిత్తర పోయిన డ్రైవర్.. ఏం చేశాడంటే..

Viral Video: వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!