తవ్వకాల్లో బయటపడ్డ 1.2 కిలోల బంగారు గడ్డ.. విలువ అక్షరాలా రూ. 1.5 కోట్లు పైమాటే!

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో నిత్యం మెటల్ డిటెక్టర్‌తో అన్వేషణ చేసే ఓ వ్యక్తికి ఊహించని అదృష్టం వరించింది. టిబూబురా సమీపంలో చాలాకాలంగా త్రవ్వకాలు జరుపుతున్న అతనికి, ఇటీవల భూమిలో నుంచి ఏకంగా 1.2 కిలోల బరువున్న అరుదైన బంగారు గడ్డ లభించింది. దీనిలో సుమారు 940 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉందని పరీక్షల్లో తేలింది. ఈ అరుదైన నిధి దొరకడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఈ అద్భుత సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

తవ్వకాల్లో బయటపడ్డ 1.2 కిలోల బంగారు గడ్డ.. విలువ అక్షరాలా రూ. 1.5 కోట్లు పైమాటే!
Australia Gold Nugget

Updated on: Oct 28, 2026 | 8:16 AM

కష్టపడితే ఫలితం దక్కుతుందంటారు. కానీ కొన్నిసార్లు అదృష్టం అమాంతం తలుపు తడుతుంది. ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి అనుకోని విధంగా సాధించిన విజయం చూస్తే ఈ మాట వంద శాతం నిజమనిపిస్తుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో సుదూర ప్రాంతంలో మెటల్ డిటెక్టర్ సహాయంతో నిత్యం అన్వేషణ చేసే ఓ వ్యక్తికి ఊహించని రీతిలో భారీ బంగారు నిధి దక్కింది. సుదీర్ఘకాలంగా ఖనిజాల కోసం త్రవ్వకాలు జరుపుతున్న అతనికి ఏకంగా 1.2 కిలోల బరువున్న అరుదైన బంగారు గడ్డ లభించింది.

మెటల్ డిటెక్టర్ సిగ్నల్‌తో మారిన తలరాత

ఆ వ్యక్తి టిబూబురా ప్రాంతంలోని మౌంట్ స్టువర్ట్ స్టేషన్‌ పరిసరాల్లో చాలా రోజులుగా అన్వేషిస్తున్నాడు. నిరాశే ఎదురవుతున్న తరుణంలో, ఒక రోజు అలసిపోయి పని ఆపేద్దాం అనుకున్న సమయంలో అతని మెటల్ డిటెక్టర్ గోల్డ్ మాన్‌స్టర్ 2000 నుండి విభిన్నమైన శబ్దం వచ్చింది. మొదట పెద్దగా సిగ్నల్ రాకపోయినా, కొద్ది దూరంలో మట్టిని తొలగించి చూసేసరికి అక్కడ ఒక మెరిసే వస్తువు కనిపించింది. మట్టిని పూర్తిగా శుభ్రం చేసి చేతిలోకి తీసుకున్న తర్వాతే అది స్వచ్ఛమైన బంగారు గడ్డ అని అతనికి అర్థమైంది. తన కళ్లను తానే నమ్మలేకపోయిన ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

విలువ, ప్రత్యేకతలు

నిపుణుల పరిశీలన ప్రకారం, ఈ 1.2 కిలోల బరువైన బంగారు గడ్డలో సుమారు 940 గ్రాముల వరకు స్వచ్ఛమైన బంగారం ఉంది. మార్కెట్ ధర ప్రకారం దీని విలువ దాదాపు 150,000 నుండి 160,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, అనగా భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన బంగారు గడ్డకు టిబూబురా స్పౌడ్‌ అని పేరు పెట్టారు. సాధారణంగా ఇంత పెద్ద పరిమాణంలో బంగారు గడ్డలు దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని స్థానిక నిపుణులు పేర్కొన్నారు. ఈ అరుదైన అదృష్టాన్ని పొందిన ఆ వ్యక్తి, ఈ బంగారాన్ని పురాతన వస్తువుల కలెక్టర్లకు విక్రయించే యోచనలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us