
ప్రపంచంలో చాలా మంది శారీరకంగా వికలాంగులైనప్పటికీ అపారమైన ధైర్యం, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులు లేకుండా బైక్ నడపడం అందర్ని ఆశ్చర్యపరిచింది. వీడియోలో బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తిని మీరు చూడవచ్చు. దూరం నుండి చూస్తే, చెప్పడం కష్టం, కానీ దగ్గరగా చూస్తే అతనికి రెండు చేతులు లేవని స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ అతను పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌తో బైక్‌ను స్పీడ్‌గా నడుపుతున్నాడు.
ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Digital_khan01 అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. “అతనికి చేతులు లేవు, అయినప్పటికీ అతను ఇప్పటికీ బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్నాడు. ఈ వ్యక్తి వీడియో చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది అసాధారణ ప్రతిభ, ధైర్యానికి అరుదైన ఉదాహరణ. మీరు ఎప్పుడైనా ఇలాంటిది చూశారా…??” అని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు.
दोनों हाथ नहीं, फिर भी गोली की रफ़्तार में दौड़ रही है बाइक…😲
इस शख्स का यह वीडियो देखकर आप भी हैरान हो जाएंगे। अजब-गजब टैलेंट और साहस की ऐसी मिसाल शायद ही कहीं देखी होगी।
क्या आपने कभी ऐसा कुछ देखा है…? pic.twitter.com/YW8lPGBzI8— Shagufta khan (@Digital_khan01) November 5, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి