Anushka Sharma: విరుష్క దంపతుల బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టడం ఖాయం

ప్రకాష్ సింగ్ అలియాస్... సోను చాలా సంవత్సరాలుగా అనుష్క, విరాట్‌లకు నమ్మకమైన బాడీగార్డ్‌గా సేవలు అందిస్తున్నాడు. వారి కుటుంబంలో ఒకడిగా మెదులుతున్నాడు. అందుకే అతడికి అంత జీతం ఇస్తున్నారు. కొందరు లైఫ్ మొత్తం జాబ్ చేసినా కూడా అతడు ఏడాదిలో సంపాదన అర్జించలేరు.

Anushka Sharma: విరుష్క దంపతుల బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టడం ఖాయం
Anushka Sharma's Bodyguard
Follow us

|

Updated on: Apr 17, 2024 | 9:14 PM

బాడీ గార్డ్ కావాలంటే ఏముంది.. నెలకు 30 వేలు ఇచ్చినా కండలు తిరిగిన దేహంతో జనం భయపడే వ్యక్తి వస్తాడు. ఏ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి అయినా అలాంటి వ్యక్తిని తెప్పించుకోవచ్చు. ఇంకా క్వాలిటీ మనిషి కావాలంటే.. నెలకు లక్ష చొప్పున ఏడాదికి.. 12 లక్షలు చెల్లించి రప్పించుకోవచ్చు. కానీ నమ్మదగిన, ప్రాణాన్ని పణంగా పెట్టే అంగరక్షకుడు దొరకడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఎవరైనా తమకు అలా కనిపిస్తే వారికి నమ్మలేని జీతం ఇచ్చి.. లైఫ్ లాంగ్ తమ వద్దే ఉంచుకుంటారు. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా, షారుక్ ఖాన్ అంగరక్షకుడు రవి సింగ్ ఆ కోవలోకే వస్తారు. వీరు ఆయా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా.. నీడలాగా అనుసరిస్తూ ఉంటారు. కాలక్రమేణ వీరు.. ఆ ప్రముఖల కుటుంబ సభ్యుల్లా మారిపోతారు. సెలబ్రిటీ బాడీగార్డుల జీతాలు కూడా నమ్మలేనట్లుగా ఉంటాయి.

ఈ క్రమంలోనే భారతీయ ప్రముఖ సెలబ్రిటీ జంట అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల బాడీగార్డ్ సంపాదన ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 2017లో మ్యారేజ్ కాకముందుకు కూడా అనుష్క శర్మకు.. ప్రకాష్ సింగ్ అలియాస్ సోను విశ్వసనీయమైన బాడీగార్డ్‌గా ఉన్నారు. పని పట్ల అతని అంకితభావం, వృత్తిపరమైన బాధ్యత కారణంగా… అతను వారి ఇంటిలో ప్రియమైన వ్యక్తిగా మారిపోయాడు. పెళ్లి అయ్యాక కోహ్లీ సైతం అతడి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం పలు సందర్భాలలో కనిపించింది.

సోనూ వార్షిక వేతనం రూ.1.2 కోట్లు అని తెలిసింది. అవును, మీరు చదివింది నిజమే!. అతని సంపాదన దేశంలోని చాలా మంది టాప్ CEOల  ప్యాకేజీల కంటే ఎక్కువే. ఒక అంగరక్షకుడు కార్పొరేట్ వ్యక్తుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.   అనుష్క 2018లో ‘జీరో’ చిత్ర షూటింగ్‌లో ఉన్నప్పుడు సోను పుట్టినరోజును సెట్‌లో జరిపిన ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది.  పబ్లిక్ ఈవెంట్‌లలో విరాట్ కోహ్లీ భద్రతను కూడా చూసుకుంటాడు సోను. ఒక మనిషికి నమ్మదగిన, రక్షణ కలిగించే వ్యక్తిగా ఉండటం మాములు విషయం కాదు. అందుకే అతడికి అంత ఫ్యాకేజ్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles