Viral: పెళ్లి మండపంలోకి ప్రవేశించిన ఎద్దు.. ఒక్కొక్కరికి సినిమా చూపించింది భయ్యా..

|

Dec 09, 2022 | 6:00 PM

Viral Video: పెళ్లి రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.. ఆ వేడుక అంతా డిస్ట్రబ్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు.. పెళ్లి చేసుకుంటున్నవారు ఇబ్బంది పడుతారు. ఇక ఫంక్షన్ హాల్‌ వద్ద పరిస్థితి అయితే చెప్పనలవి కాదు.

Viral: పెళ్లి మండపంలోకి ప్రవేశించిన ఎద్దు.. ఒక్కొక్కరికి సినిమా చూపించింది భయ్యా..
Bull Attack
Follow us on

పెళ్లి రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే.. ఆ వేడుక అంతా డిస్ట్రబ్ అవుతుంది. పెళ్లికి వచ్చిన వారు.. పెళ్లి చేసుకుంటున్నవారు ఇబ్బంది పడుతారు. ఇక ఫంక్షన్ హాల్‌ వద్ద పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. ఫంక్షన్ హాల్లోకి రోడ్డుపై ఉండే జంతువులు ప్రవేశించి డిస్ట్రబ్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఓ పెళ్లి వేడుకలో ఎదురయ్యింది. ఓ పెళ్లి వేడుకలో ఎద్దు నానా బీభత్సం సృష్టించింది. ఒక్కొక్కరికి సుస్సు పోయించింది. ఆ ఎద్దు దెబ్బకు ఒక్కొక్కరు ఒక్కో దేశం అన్నట్లుగా తలోవైపు పరుగులు తీశారు. వాడి కొమ్ములతో.. తనకు ఎదురొచ్చిన వారినల్లా కుమ్మేస్తూ బీభత్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

బాగా ఆకలితో ఉన్న పెళ్లి జరుగుతున్న ఫంక్షన్‌ హాల్‌లోకి ఎంటరైంది. నలుపు రంగులో, దిట్టంగా, వాడిగా ఉన్న కొమ్ములతో.. బలిష్టంగా ఉన్న ఆ ఎద్దు.. బయటి నుంచి నేరుగా ఫంక్షన్ హాల్‌లోకి ప్రవేశించింది. హాల్‌లో ఉన్న జనాలను చూసి అది కాస్తా కంగారు పడింది. ఆ కంగారులో కోపానికి గురైంది. ఇంకేముందు.. తనకు కళ్ల ఎదుట ఎవరు కనిపిస్తే వారిపై దాడి చేసే ప్రయత్నం చేసింది. దానిని చూసి పెళ్లికి వచ్చిన అతిథులు తలోదిక్కు పరుగులు తీశారు. అలా కాసేపు ఆ ఎద్దు నానా హంగామా చేసింది. అదృష్టం కొద్ది అది పెళ్లి మండపం ఉన్న హాల్‌లోకి వెళ్లలేదు. బయట ఉన్న డైనింగ్ హాల్‌లోకి మాత్రమే ప్రవేశించింది. అక్కడ కొద్ది మాత్రమే ఉండటంతో ప్రమాదం తప్పింది. కాసేపటి తరువాత ఆ ఎద్దు దానంతట అదే బయటకు వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఎద్దు ఫంక్షన్‌ హాల్‌లోకి ఎంటరై రచ్చ చేసిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదృష్టం బాగుండి ఎవరికీ ఏం కాలేదని, లేదంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..