Anand Mahindra: లగ్జరీ కారుతో సెల్ఫీ తీసుకుంటున్న సామాన్యుడు.. ఓనర్‌ చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా..

|

Mar 22, 2025 | 9:43 PM

ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వైరల్‌ వీడియోలో రోడ్డుపై ఒక ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగివుంది.. దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్‌ మహీంద్రాను కదిలించింది. ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1 కోటి 90 లక్షలకు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు.

Anand Mahindra: లగ్జరీ కారుతో సెల్ఫీ తీసుకుంటున్న సామాన్యుడు.. ఓనర్‌ చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా..
Anand Mahindra
Follow us on

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ లో చేసిన పోస్ట్ ఒకటి విపరీతంగా వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా ఇన్‌స్టాగ్రామ్‌లో రూ. 3 కోట్ల విలువైన కారు యజమానికి సంబంధించిన పాత వీడియో ఇది.. ఇప్పుడు ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ తన హృదయాన్ని కదిలించిన దృశ్యమిది అంటూ ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ఇది చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంతకీ ఆనంద్ మహీంద్ర షేర్‌ చేసిన ఆ పాత వీడియో కొత్తగా వైరల్‌ కావటం వెనుక అసలు స్టోరీ ఏంటంటే..

ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వైరల్‌ వీడియోలో రోడ్డుపై ఒక ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగివుంది.. దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్‌ మహీంద్రాను కదిలించింది. ఆ ఖరీదైన కారు ఓనర్‌ ఆ సామాన్య వ్యక్తిని అదే కారులో రైడ్‌కు తీసుకెళ్లి తన ఔదర్యం చాటుకుంటాడు. దీంతో సాధారణ వ్యక్తి ఎంతో సంతోషపడతాడు. ఈ క్లిప్ చూసి మనుసు చలించిపోయిన ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేశారు. ‘ఈ వీడియో పాతది కావొచ్చు.. నేను ఈ వీడియోను ఇటీవలే చూశాను, నన్ను ఈ వీడియో కదిలించింది. ముందుగా ఆ కారు యజమాని సానుభూతికి ధన్యవాదాలు అంటూ క్యాప్షన్‌ రాశారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1 కోటి 90 లక్షలకు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు. మహీంద్రా అదే వీడియోను తిరిగి పోస్ట్ చేసి,దానికి ప్రజల హృదయాల్ని హత్తుకునేలా క్యాప్షన్‌ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..