ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. సాధారణంగా ఒకే కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే అసలు ఎలాంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు అచ్చంగా ఒకేలా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడీ టాపిక్ ఎందుకనేగా మీ సందేహం..
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియా గురించి కాస్త ఐడియా ఉన్న వారికి కూడా ఆనంద్ మహీంద్రా తెలిసి ఉంటారు. ట్విట్టర్ వేదికగా నిత్యం టచ్‌లో ఉంటూ, సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మనుషులను పోలిన మనుషులు ఉంటారనడానికి ఈ ట్వీట్ సాక్ష్యంగా నిలుస్తోంది..
@anandmahindra You too can get shocked after seeing this person.
My colleague from Pune, lookalike Anand Mahindra. pic.twitter.com/ufNQrjoBlz
— PJ (@pjdaddyofficial) November 3, 2023
వివరాల్లోకి వెళితే.. ఓ నెటిజన్ అచ్చంగా ఆనంద్ మహీంద్రను పోలిన వ్యక్తి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు.. ‘ఈ వ్యక్తిని చూసిన తర్వాత మహీంద్రా కూడా షాక్ అవుతారు. అతడు నా సహోద్యోగి’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటో కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఆనంద్ మహీంద్ర కంటపడింది. దీంతో ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఫన్నీ కామెంట్ రాసుకొచ్చారు. ‘మా చిన్నతనంలో ఏదో మేళాలో మేం విడిపోయినట్టున్నాం’ అని రాసుకొచచారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..