Viral Video: కదులుతున్న కారును ఢీకొట్టిన విమానం.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే..

విమాన ప్రమాదం గురించి ఆలోచించడమే భయానకంగా ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్డుపై విమానం కూలిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..? అలాంటి భయానక సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. అక్కడ ఒక విమానం నేరుగా కదులుతున్న కారుపై ల్యాండ్ అయింది. కొన్ని సెకన్ల తర్వాత అక్కడ ఏం జరిగిందో వీడియో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది.

Viral Video: కదులుతున్న కారును ఢీకొట్టిన విమానం.. ఆ తరువాత ఏం జరిగిందో చూస్తే..
Plane Crash In Florida

Updated on: Dec 10, 2025 | 11:12 AM

విమానం నడపడం చాలా మందికి ఒక కల. కానీ, అందరూ దానిని నియంత్రించలేరు. టేకాఫ్ చేయలేరు. ల్యాండ్ చేయలేరు. వాణిజ్య విమానాల విషయానికి వస్తే, పైలట్లు ఎంతో శిక్షణ పొంది ఉంటారు. కానీ చిన్న విమానాల విషయానికి వస్తే వారు లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ, ప్రతిసారీ సరైన ల్యాండింగ్‌ను నిర్ధారించేంత నైపుణ్యం కలిగి ఉండరు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ ఒక విమానం కదులుతున్న కారుపై ల్యాండ్ అయింది.

సోమవారం ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఒక వింత దృశ్యం బయటపడింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్‌స్టేట్ 95 హై-స్పీడ్ లేన్‌లలో ట్రాఫిక్ యథావిధిగా కదులుతోంది. అకస్మాత్తుగా ఒక విమానం ఆకాశం నుండి కిందకు పడిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

విమానం ఢీకొన్న కారును 57 ఏళ్ల మహిళ నడిపిస్తున్నట్టుగా తెలిసింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని తెలిసింది.. ప్రమాదానికి గురైన విమానాన్ని 27 ఏళ్ల పైలట్ నడిపాడు. ఆశ్చర్యకరంగా, అతను కూడా ఎటువంటి గాయాలు లేకుండా ఈ భయంకరమైన ప్రమాదం నుండి తప్పించుకున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఫ్లోరిడా హైవే పెట్రోల్ ప్రకారం, విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ప్రాథమిక దర్యాప్తులో ఇంజిన్ వైఫల్యం లేదా యాంత్రిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేశారు.. శిథిలాలను పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ఆ రెండింటీలో ఏది పేలిన కూడా ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని , అదృష్టవశాత్తూ అది తప్పిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..