అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి.. ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!

సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ ప్రసిద్ధ భక్తి గీతం 'ఏకదంతాయ వక్రతుండాయ' పాటకు భక్తిశ్రద్ధలతో నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంబానీ ఇంట ఘనంగా గణేష్ చతుర్థి.. ఏకదంతాయ భక్తిపాటకు రాధికా మర్చంట్ అదిరిపోయే డ్యాన్స్!
Radhika Merchants Viral Dance

Updated on: Sep 15, 2026 | 10:27 AM

దేశవ్యాప్తంగా సోమవారం గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అయిన ముఖేష్‌ అంబానీ నివాసమైన యాంటిలియాలో ఈ గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులంతా భక్తిశ్రద్ధలతో ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ సతీమణి రాధికా మర్చంట్ ప్రసిద్ధ భక్తి గీతమైన ‘ఏకదంతాయ వక్రతుండాయ’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా అంబానీ నివాసం విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో మెరిసిపోయింది. సోమవారం సాయంత్రం ఆ గణనాథుడు ఇంటికి చేరుకోగానే నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధిక పూజాదికాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల వర్షం మధ్య నీతా, రాధిక డోలు వాయిద్యాలకు అనుగుణంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఆ బుజ్జి గణపయ్యకు ఆహ్వానం పలికారు.

రాధిక మర్‌చంట్ చేసిన నృత్యం వీడియో ఇక్కడ చూడండి..

ఇక సోమవారం పండుగ రోజు అంబానీ నివాసంలో ఏర్పాటు చేసిన గణపతి దర్శనం కోసం బాలీవుడ్ ప్రముఖులు, ఇతర ప్రముఖ వ్యక్తులు యాంటిలియాకు తరలివచ్చారు. ఈ దర్శనం కోసం సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్, ఆలియా భట్, కాజోల్, సచిన్ టెండూల్కర్ కుటుంబ సమేతంగా హాజరై బాప్పా ఆశీస్సులు అందుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us