అలాద్దీన్ జెనీ, కోతి వేషం ధరించిన ఓ వ్యక్తి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. ఇందులో జిన్ అనే కల్పిత పాత్ర కోతి వేషం వేసుకున్న వ్యక్తితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపబడింది. కొన్ని సెకన్ల ఈ ఫన్నీ డ్యాన్స్ వీడియో క్లిప్ షట్టర్‌బాక్స్ ఫిల్మ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో జిన్ కొన్ని క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ ను ప్రదర్శిస్తుండగా.. తన డ్యాన్స్ పార్ట్‌నర్ ఐన కోతితో కలిసి ‘డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. ఈ వింత జంట తమ డ్యాన్స్ ప్రధానకు ఏ స్టూడియో లేదా స్టేజ్‌ని ఎంచుకోలేదు. తమ డ్యాన్స్ ను ప్రదర్శించలేదు. వీరు తమ నాట్య నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి స్థానిక వీధులను ఎంచుకున్నారు. వీడియోలో జెనీ, మంకీమ్యాన్ ట్రెండింగ్ పాటకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు.
ఈ ప్రత్యేకమైన జోడీ తమ ప్రతిభతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. వీళ్లిద్దరూ వీధుల్లో డ్యాన్స్ చేస్తుంటే పక్కనే ఉన్న ఫ్లాట్‌ల నుంచి జనాలు వీక్షించడం వీడియోలో కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు తమ బాల్కనీలో నిలబడి ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షిస్తూ చాలా ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
ఈ వీడియో ఈ ఏడాది ఆగస్టు చివరిలో షేర్ చేయబడింది.. అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో మళ్లీ మల్లీ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 12 మిలియన్ల వ్యూస్, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. జెనీ, మంకీమ్యాన్ యొక్క క్లాసిక్ డ్యాన్స్ రీతులు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీంతో నెటిజన్లు కామెంట్ సెక్షన్‌ను హార్ట్ , ఫైర్ ఎమోజీలతో నింపెశారు.
మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..