Viral Video: ఇంత క్యూట్‌‌గా మరెవరూ పాడరేమో.. అటు డాగీ, ఇటు బేబీ దుమ్ము రేపారు.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. నలుదిక్కులో ఏ మూలన ఏం జరిగినా..

Viral Video: ఇంత క్యూట్‌‌గా మరెవరూ పాడరేమో.. అటు డాగీ, ఇటు బేబీ దుమ్ము రేపారు.. బ్యూటీఫుల్ వీడియో మీకోసం..
Viral Video

Updated on: Apr 26, 2022 | 4:13 PM

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. నలుదిక్కులో ఏ మూలన ఏం జరిగినా.. ప్రపంచానికి ఇట్టే తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియాతో పాటు.. వీడియో షేరింగ్ యాప్స్ ట్రెండింగ్ పెరిగిపోతున్న కాలంలో.. జనాలు తమలోని ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటెచెబుతున్నారు. తమ ట్యాలెంట్‌ను వీడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారికి సంబంధించి వీడియో సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు మంత్రముగ్దులు అవుతున్నారు. అయితే, వీడియోలో చిన్నారి మాత్రమే కాదు.. వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఇటు డాగీ, ఇటు చిన్నారి కలిసి చేసిన సందడికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

సహజంగానే పిల్లలకు తమకు నచ్చిన రీతిలో ఏదో ఒకటి పాడుతుంటారు. ఈ వీడియోలో చిన్నారి పాట పాడుతుండగా.. పక్కనే ఉన్న పెంపుడు కుక్క బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాదిరిగా కోరస్ ఇస్తోంది. పాట పాడుతున్న సమయంలో పాప ఎక్స్‌ప్రెన్షన్స్, డాగీ హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఒక మిలియన్ పైగా వ్యూస్ రాగా, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. చిన్నా పాట, డాగ్ కోరస్‌కు ఫిదా అయిపోతున్న నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ కచేరీ సూపర్’ అని కొందరు.. ఫ్యూచర్ పాప్ సింగర్ అని మరికొందరు అంటున్నారు. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

Also read:

Traffic Challan: ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. చలాన్లు ఇలా కూడా వేస్తారా?.. తలపట్టుకున్న వాహనదారుడు..!

Smart Water Bottle: మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ వచ్చేశాయి.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

TS Police Recruitment 2022: హైదరాబాద్‌లో పది కేంద్రాల్లో ప్రారంభమైన పోలీస్‌ ఉచిత శిక్షణ