Dance Video: డాన్స్‌ అదరగొట్టిన నేపాలీ మహిళలు.. మహిళల పెర్‌ఫార్మెన్స్‌కు కోట్లమంది నెటిజన్లు ఫిదా

|

Jan 23, 2023 | 12:14 PM

డ్యాన్స్.. అనేది ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న కళ. బాగా చేయడం వచ్చినా రాకున్నా.. మ్యూజిక్ వినిపిస్తే చాలు కదిపేస్తుంటారు చాలా మంది. మరి కొందరు మాత్రం మ్యూజిక్ కు తగ్గట్టుగా అద్దిరిపోయే స్టెప్పులు వేసి ఔరా అనిపిస్తుంటారు....

Dance Video: డాన్స్‌ అదరగొట్టిన నేపాలీ మహిళలు.. మహిళల పెర్‌ఫార్మెన్స్‌కు కోట్లమంది నెటిజన్లు ఫిదా
Nepali Women Dance
Follow us on

డ్యాన్స్.. అనేది ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న కళ. బాగా చేయడం వచ్చినా రాకున్నా.. మ్యూజిక్ వినిపిస్తే చాలు కదిపేస్తుంటారు చాలా మంది. మరి కొందరు మాత్రం మ్యూజిక్ కు తగ్గట్టుగా అద్దిరిపోయే స్టెప్పులు వేసి ఔరా అనిపిస్తుంటారు. నెట్టింట మనం ప్రతిరోజూ ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. అందులో డాన్స్‌లకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇటీవల పెళ్లి అయినా, పార్టీ అయినా.. సందర్భం ఏదైనా డాన్స్‌ కామన్‌ అయిపోయింది. ఇందుకు దేశం, రాష్ట్రం, ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడైనా ఎవరైనా డాన్స్‌ చేయాల్సిందే. నెట్టింట పోస్ట్‌ చేయాల్సిందే… ఎస్‌.. ప్రస్తుతం ఓ హుషారైన డాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో నేపాళీ మహిళలు చేసిన డాన్స్‌ చూస్తే మీరు కూడా లేచి ఉత్సాహంగా ఆడతారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కంగనా రనౌత్‌ నటించిన క్వీన్‌ సినిమాలోని ‘లండన్‌ తుమక్ద’ సాంగ్‌కు ఈ నేపాలీ మహిళలు ఎంతో ఎనర్జిటిక్‌గా డాన్స్‌ చేశారు. నేపాల్ రాజ‌ధాని ఖాట్మండుకు చెందిన ది వింగ్స్ టీమ్ ఈ హుషారైన బీట్‌కు క్రేజీ మూమెంట్స్‌తో నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంది. ఈ క్లిప్‌లో ట్రాక్ ప్యాంట్లు ధ‌రించి న‌లుగురు మ‌హిళ‌లు కిల్లర్ స్టెప్స్‌తో కిక్కెక్కించారు. భాంగ్రా డ్యాన్స్‌తో ఫుల్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో మగువలు అదరగొట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇప్పటికే ఏకంగా కోటి 2 లక్షలమంది వీక్షించారు. మహిళ పెర్‌ఫార్మెన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.. లైక్స్‌తో కామెంట్లతో డాన్స్‌ ఆడేస్తున్నారనుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..