Trending Video: అరెరే.. టీవీలో పులి కనిపించిందని టీవీనే పగలగొట్టాడు.. షాకింగ్ వీడియో మీకోసం

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వినియోగం చాలా పెరిగిపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాతి నుంచి ఈ పరిస్థితి...

Trending Video: అరెరే.. టీవీలో పులి కనిపించిందని టీవీనే పగలగొట్టాడు.. షాకింగ్ వీడియో మీకోసం
Tv Breaking Video

Updated on: Jan 16, 2023 | 7:26 AM

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వినియోగం చాలా పెరిగిపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ.. ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాతి నుంచి ఈ పరిస్థితి మరింత అధికమైంది. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్, డౌన్లోడ్ అవుతుంటాయి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్, ఫేస్ బుక్ స్టోరీస్ విశేష ఆదరణ పొందుతున్నాయి. తమకు వచ్చిన ట్యాలెంట్ ను వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ వ్యూస్ పొందుతున్నారు పలువురు. వీటిలో ఆశ్చర్యపరిచేవి కొన్నైతే.. ఫన్నీగా అనిపించేవి మరికొన్ని. చాలా సార్లు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు.. మన కళ్ళు మనల్ని ఆశ్చర్యపరిచే వీడియోలపై ఆగిపోతాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హారర్ సినిమా చూసిన తర్వాత భయపడటం సహజమే. కానీ టీవీలో జంతువును చూసి భయపడి టీవీని పగలగొట్టిన ఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఇది నిజంగా జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు టీవీ చూస్తున్నారు. ఇంతలో టీవీలో పులి కనిపించింది. దాంతో టీవీ చూస్తున్న ఓ వ్యక్తి భయపడిపోతాడు. పులిని కొట్టాలనే ఉద్దేశంతో పెద్ద కర్రతో టీవీని బలంగా కొడతాడు. దీంతో టీవీ పగిలిపోయింది. ఈ క్లిప్ చూశాక మొదట్లో నవ్వాలనిపించినా.. మరుసటి క్షణమే అతని పిచ్చి చేష్టకు చిర్రెత్తుకొస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. టీవీలో చూసి భయపడుతున్నంత మాత్రాన ముందు పులిని చూసి ఎవరూ భయపడరని, ఇది కావాలాని చేసినట్లు తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..