Trending Video: మొసలికి దిమ్మదిరిగే షాకిచ్చిన జింక.. రెప్పపాటులో తప్పించుకున్న జింకపిల్ల.. నెట్టింట షాకింగ్ వీడియో..

|

Jan 08, 2023 | 1:18 PM

అడవి చాలా అందమైనది. పచ్చని చెట్లు, జంతువుల పరుగులు, పక్షుల కిలకిలరావాలు, గలగలపారే సెలయేళ్లు, కీచు రాళ్ల చప్పుళ్లు.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. ఇదంతా ఓ వైపు.. మరోవైపు...

Trending Video: మొసలికి దిమ్మదిరిగే షాకిచ్చిన జింక.. రెప్పపాటులో తప్పించుకున్న జింకపిల్ల.. నెట్టింట షాకింగ్ వీడియో..
Deer Escaping Video
Follow us on

అడవి చాలా అందమైనది. పచ్చని చెట్లు, జంతువుల పరుగులు, పక్షుల కిలకిలరావాలు, గలగలపారే సెలయేళ్లు, కీచు రాళ్ల చప్పుళ్లు.. అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. ఇదంతా ఓ వైపు.. మరోవైపు మాత్రం అడవిలో నివసించే జంతువులకు నిత్యం జీవన్మరణ పోరాటమే. బతుకు సాగించాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సిందే. ఈ క్రమంలో ఎన్నో రకాల జీవుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. తమకంటే పెద్ద జంతువులకు ఆహారంగా మారిపోతుంటాయి. ఇటీవల నెట్టింట అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతూ.. వాటి జీవన విధానాన్ని కళ్లకుగట్టినట్టు చూపిస్తున్నాయి. నెటిజన్లు కూడా వాటిని చాలా ఇష్టపడుతున్నారు. తాజాగా ఓ జింకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

జింక పరుగు గురించి అందరికీ తెలిసిందే. వాయువేగంతో పరిగెడుతుంది. అడవిలో ఒక నీటి కొలను వద్ద నీళ్తు తాగేందుకు వచ్చింది ఓ చిన్న జింక పిల్ల. అది నీళ్లు తాగుతుండగా కొలనులో ఉన్న మొసలి గమనించింది. ఇవాళ్టికి తన పొట్ట నిండినట్లే అనుకుంది. చప్పుడు చేయకుండా వచ్చి ఒక్కసారిగా జింక పిల్లపై ఎటాక్‌ చేసింది. అయితే ఆ జింకపిల్ల అంతకు మించిన షాక్‌ ఇచ్చింది.. మెరుపు తీగలా మొసలి బారినుంచి తప్పించుకుంది. ఊహించని ఘటనతో మొసలి బిత్తరపోయింది. నోటిదాకా వచ్చి జారిపోయిందే అనుకుంటూ కొలనులోకి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌ అయింది. ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. జింక సమయస్పూర్తికి ఫిదా అవుతున్నారు. అందుకే ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..