అడవి చాలా అందమైనది. పచ్చని కొండలు, పక్షుల కిలకిలరావాలు, సెలయేళ్ల చప్పుళ్లు.. మనసు దోచుకుంటాయి. ఇదంతా ఓ వైపు.. కానీ మరోవైపు.. చూస్తే అడవి చూసినంత ప్రశాంతంగా ఉండదు. అక్కడ నివసించే జంతువుల మధ్య బతుకు కోసం నిత్యం పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఒక జీవి బతకాలంటే మరో జీవి ప్రాణాలు కోల్పోవాల్సిందే. ప్రాణాలు కాపాడుకోవాలంటే మరో జీవిని చంపడం తప్పదు. అయితే అడవిలో పెంపుడు జంతువులతో పాటు క్రూర జంతువులు కూడా ఉంటాయి. సింహాలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఇలా చాలానే ఉన్నాయి. నీటిలో మొసలి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీటిలో ఉన్నప్పుడు దాని చేతికి చిక్కితే అది ప్రాణాలే తీసేస్తుంది. నేలపై నివసించే వాటిలో చిరుత చాలా వేగవంతమైంది. వాటి పరుగును అందుకోవండం ఏ జంతువుకూ సాధ్య కాదు. అయితే ఆ రెండు ఒకేసారి తలపడితే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు.
సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. జంతువులు వేటాడే వీడియోలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చిరుత, మొసలికి సంబంధించింది. వాస్తవానికి ఈ క్లిప్ లో నది ఒడ్డున ఓ మొసలి సేద తీరుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఓ చిరుత వస్తుంది. గుట్టుచప్పుడు కాకుండా మొసలిపై ఎటాక్ చేస్తుంది. ఊహించి ఘటనతో మొసలి అవాక్కవుతుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు నీటి లోపలికి వెళ్తుంది. కానీ చిరుత గట్టిగా పట్టుకోవడంతో అది తప్పించుకనే మార్గం లేకుండా పోయింది.
ఈ షాకింగ్ వీడియో వైల్డ్ యానిమల్ పిక్స్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటివరకుక 1 లక్ష 77 వేల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా 11 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.