Viral Video: అందుకే బాసూ అమ్మాయిలను నమ్మొద్దు.. తోడుగా వెళ్తే కుక్కల మధ్య వదిలేసింది

కుక్కలు (Dogs) పెంపుడు జంతువులే అయినప్పటికీ అవి చాలా ప్రమాదకరమైనవి. ఇంట్లో పెంచుకునేవే కాకుండా రోడ్లపై తిరిగే ఊరకుక్కల సంఖ్యా అధికంగానే ఉంటోంది. అవి మనుషులపై ఎప్పుడు దాడి చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కుక్కలు ఎక్కు్వగా ఉన్న...

Viral Video: అందుకే బాసూ అమ్మాయిలను నమ్మొద్దు.. తోడుగా వెళ్తే కుక్కల మధ్య వదిలేసింది
Dog Attack Video
Follow us

|

Updated on: Jul 30, 2022 | 9:25 PM

కుక్కలు (Dogs) పెంపుడు జంతువులే అయినప్పటికీ అవి చాలా ప్రమాదకరమైనవి. ఇంట్లో పెంచుకునేవే కాకుండా రోడ్లపై తిరిగే ఊరకుక్కల సంఖ్యా అధికంగానే ఉంటోంది. అవి మనుషులపై ఎప్పుడు దాడి చేస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కుక్కలు ఎక్కు్వగా ఉన్న ఏరియాల్లో వెళ్లేందుకు పిల్లలే కాకుండా పెద్దలూ భయపడతూ ఉంటారు. వారి మధ్య నుంచి వెళ్లేందుకు భయంతో వణకిపోతారు. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే అవి మనపై దాడి చేసే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి దాడుల్లో కొందరు ప్రాణాలూ పోగొట్టుకున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా అవి చిన్నారులపై దాడి చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఈ క్లిప్ లో ఇద్దరు పిల్లలు వీధికుక్కల మధ్య చిక్కుకుంటారు. అవి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అదే సమయంలో అమ్మాయి అక్కడి నుంచి పరారైంది. అతనికి ఏం చేయాలో తెలియక కంగారు పడ్డాడు. ఏ మాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా వాటిని ఎదురించి, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రాత్రి సమయంలో ఇద్దరు చిన్నారులు కలిసి బయటకు వెళ్లారు. వారిని చూసి కుక్కలు అరుస్తూ సమీపానికి చేరుకుంటాయి.

ఓ చిన్నారి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. కానీ బాలుడు మాత్రం అక్కడే ఇరుక్కుపోతాడు. అతనిని అన్ని వైపుల నుంచి కుక్కలు చుట్టుముట్టాయి. బాలుడు ధైర్యంగా వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తాడు. కొంత సమయం తరువాత అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 35 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని చూసిన తర్వాత నెటిజన్లు వివిధ కామెంట్లు చేశారు. ఆ చిన్నారిని కొందరు ‘హీరో’ అని, మరికొందరు ‘ధైర్యవంతుడు’ అని పేర్కొంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..