భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తున్నారు. ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో రైళ్లే భారత దేశ ప్రజలకు ప్రధాన ప్రజారవాణాగా నిలిచింది.. ఇలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రైలు డోర్ దగ్గర నిలబడి ప్రయాణిస్తుంటారు చాలా మంది. కొందరు కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు కదులుతున్న రైలు నుంచి కిందకు దిగి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ ఒక్కోసారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఇలా ట్రైన్ డోర్ దగ్గర నిలబడిన మనుషులు ట్రైన్ కదలడం మొదలెట్టగానే ట్రైన్ వెంట ఓ కుక్క పరుగెత్తి మనుషుల్ని ట్రైన్ లోకి వెళ్లేలా చేసింది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఈ కుక్కను ఇండియన్ రైల్వే రైలులో రైల్వే పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్థిస్తున్నారు.
భారతీయ రైల్వే అధికారి అనంత్ రూపనగుడి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ 22 సెకన్ల వీడియోలో రైలు డోర్ వద్ద నిలబడి ఉన్న ప్రతి ఒక్కరినీ దాని అరుపులతో వారిని రైల్లోకి వెళ్లేలా వెంటాడుతుంది. రైలు వెంటే ప్లాట్‌ఫారమ్ వెంబడి నడుస్తుంది. మనుషులు లేని డోర్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లే కుక్క.. రైలుతో పాటు రైలు డోర్ వద్ద కూర్చున్న వారిని వెంటాడుతోంది. ఈ సమయంలో, కుక్కను చూసి ప్రజలు రైలులోకి ప్రవేశించారు. అయితే కొంతమంది రైలు మెట్లపై నుండి తమ పాదాలను పైకి లేపారు. రైలుతో పాటు పరుగెత్తే ఈ కుక్క కిందపడిపోతుందేమోనని జనం భయపడితే.. కుక్క మాత్రం జాగ్రతగా అడుగులు వేస్తూ ప్రజలను వెంటాడుతోంది. ఈ కుక్క తన భద్రతతో పాటు ప్రజల భద్రతపై కూడా శ్రద్ధ చూపుతుంది.
The best assistance rendered in a drive against the foot board travelling. 😀😛😂 #IndianRailways #SafetyFirst pic.twitter.com/vRozr5vnuz
— Ananth Rupanagudi (@Ananth_IRAS) December 29, 2023
ఈ కుక్క వీడియోను లక్ష మందికి పైగా వీక్షించగా పలువురు పలు కామెంట్లు చేశారు. కొంతమంది కుక్కలను రైల్వేలో చేర్చమని అభ్యర్థిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..