Trending: అదృష్టమంటే మీదే సామీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు..

|

Sep 23, 2022 | 4:09 PM

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో ఊహించలేం. ఇవాళ బాగా ఉన్న వారు రేపు ఏమి లేకుండా మారినా.. ఇవాళ ఏమీ లేని వాళ్లు రేపటి నాడు ఉన్నతంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు...

Trending: అదృష్టమంటే మీదే సామీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు..
Diamond In Madhya Pradesh
Follow us on

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఏ రూపంలో వరిస్తుందో ఊహించలేం. ఇవాళ బాగా ఉన్న వారు రేపు ఏమి లేకుండా మారినా.. ఇవాళ ఏమీ లేని వాళ్లు రేపటి నాడు ఉన్నతంగా మారినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దశ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది మధ్యప్రదేశ్‌లో. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని పన్నా జిల్లా వజ్రాల గనులకు ప్రసిద్ధి. అక్కడ నివసించే చాలా మంది వజ్రాల గనుల్లో పని చేస్తుంటారు. బ్రిజ్‌పుర్‌కు చెందిన రైతు రాజేంద్ర గుప్త, అతని స్నేహితులు కలిసి కొంత కాలం క్రితం లల్కీ ధేరీ అనే ప్రాంతంలో ఒక చిన్న వజ్రాల గనిని లీజుకు తీసుకున్నారు. తర్వాత వజ్రాల కోసం గనిని తవ్వడం ప్రారంభించారు. ఇలా ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు నిరంతరాయంగా శ్రమించారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా వజ్రాల కోసం అన్వేషణ సాగించారు. అయినా వారికి వజ్రాలు దొరకలేదు. అయినా వారిలో దొరకలేదు. అయినప్పటికీ నిరాశ చెందలేదు. వజ్రాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో ముందుకు నడిచారు. అతని శ్రమ ఫలించింది. సెప్టెంబర్‌ 22న వారికి గనిలో విలువైన 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. ఎంతో ఆనందపడిన రాజేంద్ర గుప్త దాన్ని వెంటనే వజ్రాల కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు చూపించారు.

వజ్రాన్ని పరిశీలించిన అధికారులు వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును సమానంగా పంచుకుని ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇలా రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులయ్యారు. ఈ విషయం కాస్తా దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం