Viral News: కూతుర్ని ఒడిలో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి.. జస్ట్ మిస్ అయితే..

|

Jul 26, 2024 | 5:38 PM

ప్రస్తుత కాలంలో యాక్సిడెంట్ల సంఖ్య అనేది బాగా ఎక్కువ అవుతుంది. యాక్సిడెంట్లకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు మనం చూస్తూనే ఉంటున్నాం. ఆ వీడియోలు చూడటానికే చాలా భయంగా ఉంటుంది. ఇక డ్రైవింగ్‌లో ఉన్నవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రాణాలకే ప్రమాదం. చిన్న నిర్లక్ష్యాల వల్ల యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయిన వారిని చాలా మందిని చూశాం. మన కళ్ల ముందు కూడా చాలానే..

Viral News: కూతుర్ని ఒడిలో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి.. జస్ట్ మిస్ అయితే..
Virtal Video
Follow us on

ప్రస్తుత కాలంలో యాక్సిడెంట్ల సంఖ్య అనేది బాగా ఎక్కువ అవుతుంది. యాక్సిడెంట్లకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు మనం చూస్తూనే ఉంటున్నాం. ఆ వీడియోలు చూడటానికే చాలా భయంగా ఉంటుంది. ఇక డ్రైవింగ్‌లో ఉన్నవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రాణాలకే ప్రమాదం. చిన్న నిర్లక్ష్యాల వల్ల యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోయిన వారిని చాలా మందిని చూశాం. మన కళ్ల ముందు కూడా చాలానే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా రోడ్లపై ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో మరింత కేర్ అవసరం. ఇప్పుడు సోషల్ మీడియాలో డ్రైవింగ్‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఓ తండ్రి తన ఒడిలో కూతుర్ని కూర్చోబెట్టుకుని కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో తనతో మాట్లాడుతూ ఉన్నాడు. కూతురు తల స్టీరింగ్‌కి జస్ట్ కొద్దిగా తగిలినా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. కానీ అసలు అదేమీ పట్టించుకోకుండా.. ఎంతో నిర్లక్ష్యంగా చిన్న పిల్లతో కారు డ్రైవింగ్ చేయడం నిజంగానే నేరమని.. అశ్విన్ రాజేష్ ఎండి అనే వ్యక్తి ఈ వీడియోను తన X ఖాతా ద్వారా షేర్ చేశాడు.

చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కానీ బిడ్డ తల స్ట్రీరింగ్‌కి తగిలితే తక్షణమే ఇద్దరి ప్రాణాలు పోతాయి. ఇది భారతీయ తల్లిదండ్రులు గమనించాలని అతను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.