Viral Video: అమ్మ బాబోయ్‌.. ఇదేం క్రియేటివిటీరా బాబు. బైక్‌ను కారుగా మార్చిన తీరు చూస్తే..

|

Sep 14, 2021 | 8:20 PM

Viral Video: 'అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు..' అప్పల్రాజు సినిమాలో వచ్చే పాటలోని చరణం ఇది. నిజంగానే ప్రతిభ అనేది ఎవరి..

Viral Video: అమ్మ బాబోయ్‌.. ఇదేం క్రియేటివిటీరా బాబు. బైక్‌ను కారుగా మార్చిన తీరు చూస్తే..
Follow us on

Viral Video: ‘అబ్బ సొత్తు కాదురా టాలెంటు.. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు..’ అప్పల్రాజు సినిమాలో వచ్చే పాటలోని చరణం ఇది. నిజంగానే ప్రతిభ అనేది ఎవరి ఒక్కరి సొంతం కాదు. మట్టిలో మాణిక్యాలుగా చాలా మంది తమ అసాధారణ ప్రతిభతో ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంటారు. అయితే వీరి టాలెంట్‌ అంత సులభంగా అందరికీ తెలియదు. కానీ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి మాత్రం ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న ట్యాలెంట్‌ ఉన్నా.. వెంటనే వైరల్‌గా మారుతోంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ యువకుడు తన పాత బండి లుక్‌ను మార్చిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బైక్‌కు ఉన్న హ్యాండిల్‌ను తొలగించి దాని స్థానంలో ఓ చిన్న స్టీరింగ్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో ఎంచక్కా కారును మలుపులు తిప్పినట్లు స్టీరింగ్‌ను తిప్పుతూ బైక్‌పై దూసుకుపోతున్నాడు. సదరు యువకుడు రోడ్డు మీద రయ్యిమని వెళుతోన్న సమయంలో పక్క నుంచి వెళుతున్న వారు తమ కెమెరాల్లో బంధించారు. వీడియో తీసిన వారు ఖాళీగా ఉంటారా.? దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ గల్లీ కుర్రాడి క్రియేటివిటీపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Viral Photos: భారతదేశంలోనే ఇవి అందమైన గ్రామాలు..! వీటి ప్రత్యేకత ఏంటంటే..?

Viral Video: కోనసీమ జాలర్ల వలకు చిక్కిన అరుదైన చేప.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Khairatabad: బ్రేకింగ్.. ఖైరతాబాద్ గణేశుని విగ్రహ నిమజ్జనంపై సంచలన నిర్ణయం తీసుకున్న ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ