Viral: బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు.. భర్త డైవర్స్ పార్టీ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

|

Dec 16, 2024 | 7:37 AM

ఈరోజుల్లో సోషల్ మీడియా పూణ్యమా అని ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. ఏ వింత ఘటన జరిగినా నెటింట్లో వైరల్‌గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి జరిగింది. ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చిన సందర్భంగా డైవర్స్ పార్టీ చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral: బిడ్డకు విడుదల.. భార్యతో విడాకులు.. భర్త డైవర్స్ పార్టీ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
1
Follow us on

ప్రస్తుతం చిన్నచిన్న కారణాలతో దంపతులు వీడిపోతున్నారు. కొందరు భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఈ విడాకుల తర్వాత ఆనందం కంటే మానసిక వేదన, బాధ, ఒంటరితనం అనుభవించేవారే ఎక్కువ ఉంటారు. అయితే విడాకులు తీసుకున్న కొద్ది మంది మాత్రమే సంతోషంగా ఉంటారు. విడాకులు తీసుకున్న సందర్భంగా  స్నేహితులతో కలిసి భారీ పార్టీ చేసుకున్న వారిని కూడా మనం చూసి ఉంటాం. అదేవిధంగా ఓ వ్యక్తి కూడా తన భార్యను వదిలించుకోవాలని విడాకుల పార్టీ చేసుకున్నాడు. అతను తన మాజీ భార్యను పోలిన ఓ విగ్రహంతో పెద్ద పార్టీ చేసుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విడాకులు తీసుకున్న ఓ వ్యక్తి సంబరాలు చేసుకున్న ఈ వింత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 2020లో కోమల్‌ను మంజీత్ పెళ్లి చేసుకోనున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వారి వైవాహిక జీవితంలో చీలిక వచ్చింది. అది కాస్త విడాకుల వరకు వెళ్లింది. అతను ఆగస్టు 1, 2024న తన భార్యతో విడిపోయాడు. తాజాగా తన భార్యతో విడిపోయినందుకు గ్రాండ్‌గా విడాకుల పార్టీని చేసుకున్నాడు.

m_s_dhakad_041 పేరుతో X ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో నెటింట్లో తెగ హల్చల్ చేసింది. ఆ వైరల్ వీడియోలో మంజీత్ తన పోలికతో తయారు చేయించిన  ఆడ బొమ్మ భుజంపై చేయి వేసుకుని నిలబడి ఉండటం అందర్నీ ఆశ్చర్చానికి గురిచేసింది. అలాగే బ్యాక్ సైడ్‌లో విడాకుల పార్టీ అనే బ్యానర్ ఉండడం షాకింగ్ ఉంది. మంజీత్ తన స్నేహితులతో కలిసి కేక్‌లు కట్ చేసి, పూలమాలలు వేసి ఘనంగా విడాకుల పార్టీ చేసుకున్నాడు

నవంబర్ 30న షేర్ చేయబడిన ఈ వీడియోకు 5.9 మిలియన్ల వ్యూస్ రాగా అనేక కామెంట్లు  కూడా వచ్చాయి. కంగ్రాట్స్.. నీ బాధ మాకు అర్థమవుతుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “అభినందనలు సోదరా”  అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. నువ్వ ఎంత నొప్పిని అనుభవించావో మాకు అర్థమవుతుందని మరో నెటిజన్ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ పాకిస్థానీ మహిళ తన పెళ్లి ఫొటోలను చించి, కేక్ కట్ చేసి విడాకుల వేడుక జరుపుకుంది. కాస్త వైరల్ అయి నెటింట్లో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి