Viral Video: పీత తలపై గుడ్డు పగలగొట్టాడు.. వీడియో వైరల్.. ఊహించని రీతిలో నెటిజన్ల రియాక్షన్..

Viral Video: రోజు రోజుకు మనుషుల్లో హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. వింత చేష్టలు, వికృత చేష్టలతో రాక్షసానందం పొందుతున్నారు.

Viral Video: పీత తలపై గుడ్డు పగలగొట్టాడు.. వీడియో వైరల్.. ఊహించని రీతిలో నెటిజన్ల రియాక్షన్..
Crab

Updated on: Aug 06, 2021 | 9:16 AM

Viral Video: రోజు రోజుకు మనుషుల్లో హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. వింత చేష్టలు, వికృత చేష్టలతో రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరీ ఇంత పైత్యం ఎందుకంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రపు ఒడ్డున హాయిగా తిరుగుతున్న పీత వద్దకు వెళ్లాడు ఆ వీడియోలోని వ్యక్తి. పీత వద్ద చిన్న గుంత చేశాడు. ఆ తరువాత.. ముందే తన వెంట తెచ్చుకున్న కోడిగుడ్డును బయటకు తీశాడు. ఆ గుడ్డును పీత తలపై కొట్టి పగులకొట్టాడు. అనంతరం.. ఆ గుడ్డు సొనను పీత ఎదురుగా తీసిన గుంతలో వేశాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని చర్యపై నిప్పులు చెరిగారు. వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు. జంతువులు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. మరీ క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు.

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌ ఐడీ Jatts Mind పేజీలో షేర్ చేశారు. వీడియో షేర్ చేసి 24 గంటలు కూడా గడవలేదు. కానీ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 4,53,849 వ్యూస్ వచ్చాయి. కామెంట్స్‌ అయితే ఇంకో రేంజ్‌లో వచ్చాయి. ఈ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Andhra Pradesh: సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు పురగోతి.. కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!

Kochi Teen: వ్యాయాయం చేస్తూ 10 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..