Viral News: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు సడన్‌గా ఎదురైన సింహం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!

Viral News: గ్రామాల మీదుగా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే అడవుల పక్కన గ్రామాల్లో ఎప్పుడూ చూడని క్రూర మృగాలు

Viral News: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులకు సడన్‌గా ఎదురైన సింహం.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!
Lion

Updated on: Feb 18, 2022 | 9:57 AM

Viral News: గ్రామాల మీదుగా వెళ్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అయితే అడవుల పక్కన గ్రామాల్లో ఎప్పుడూ చూడని క్రూర మృగాలు ఒకేసారి కళ్లముందు ప్రత్యక్షమైతే ఎవరికైనా సరే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా అలాంటి భయంకరమైన ఎక్స్‌ పీరియన్స్ ఇద్దరు వ్యక్తులకు ఎదురైంది.

గుజరాత్‌లో ఓ గ్రామం మీదుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ప్రయాణిస్తున్నారు. ఆ రహదారి వెడల్పు చాలా సన్నగా ఉంది. దీంతో రైడర్ మెల్లగా నడుపుతూ ముందుకు వెళ్తున్నాడు. అంతలోనే చెట్ల పొదల్లో నుంచి ఒక పెద్ద ఆడ సింహం బయటకు వచ్చింది.సడన్‌గా ఎదురైన సింహం చూసి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు కూడా షాక్ అయ్యారు. అది తమ వైపు ముందుకు వస్తుంటే ఏం చేయాలో తెలియక దేవుడిపైనే భారం వేశారు. అయితే అనూహ్యంగా ఆ ఆడ సింహం వారిపై అటాక్ చేయలేదు. అది వీళ్లని చూసి చూడనట్టుగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో బతుకుజీవుడా అంటూ వాళ్లు అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ వీడియోని ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేయగా 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also read:

ABG Shipyard: 23 వేల కోట్లు స్కామ్ చేసిన ఏబీజీ ఫిప్ యార్డ్ కంపెనీ కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త వాస్తవాలు..

Movie Ticket Price Issue: ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకో..! హర్షం వ్యక్తం చేస్తున్న ప్రతినిధులు..(వీడియో)

Russia Ukraine crisis: ఏ మార్గంలో పుతిన్‌ ఎటాక్‌ చేస్తాడు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ పెద్దన్న..