Viral Video:  ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది..

సోషల్ మీడియా ల్లో రకరకాల విచిత్రమైన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం అనేక రకాల వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయి.

Viral Video:  ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది..
Shocking Video

Updated on: Feb 22, 2022 | 8:50 AM

Viral Video: సోషల్ మీడియా ల్లో రకరకాల విచిత్రమైన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం అనేక రకాల వీడియోలు అప్‌లోడ్ చేయబడుతున్నాయి. మనం ఇక్కడ చూసే వీడియోలు కొన్ని మనల్ని నవ్వించేవి, మరికొన్ని ఆలోచింపజేసేవి, ఇంకొన్ని వణికించే వీడియోలు.. ఇప్పుడు ఈవీడియో కూడా అలాంటిదే.. ఈవీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టకమానదు.. అనేక బట్టల షాపుల్లో ట్రయల్ రూమ్‌ల గురించి మనం చాలా వార్తలు వింటూ ఉంటాం.. అంటే కస్టమర్లు తమకు తెలియకుండా కెమెరా పెట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రయల్ రూమ్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి.. ఈ ట్రయల్ రూమ్‌లో ఎవరు దాక్కున్నారని అంతా అనుకున్నారు. తీరా ఆశబ్దాలు ఏంటా అని చూసి అందరు భయంతో వణికిపోయారు.

అక్కడ ఉన్నది ఎవరో కాదు.. ఓ భారీ పాము. ఇలాంటి వార్తలు వింటే నమ్మడం కష్టమే కానీ ఈ వీడియో చూస్తే  నమ్మాల్సిందే.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఓ బట్టల దుకాణంలోని ట్రయల్ రూంలో దాక్కున్న పాముని వీడియోలో చూడవచ్చు. దీని వీడియో  ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో వైరల్ అవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను తన పోస్ట్ ద్వారా షేర్ చేశారు. ట్రయల్ రూమ్‌లో వింత శబ్దం రావడంతో రెస్క్యూ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఈ రెస్క్యూ టీమ్ సీలింగ్‌లో దాక్కున్న ఓ భారీ కొండచిలువను కనిపెట్టారు. ఎప్పుడు ఆపాము అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. పామును పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి పై కూడా ఆ పాము దాడికి ప్రయత్నించింది. ఏది ఏమైనా రెస్క్యూ టీమ్ చాలా చాకచక్యంగా పామును లొంగదీసుకుంది. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 18.9k వ్యూస్ కు మించి వచ్చాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Viral Video: పెళ్లి వేడుకలో లొల్లి.. నడి రోడ్డుపై చిత్తుగా కొట్టుకున్న బంధువులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలానే ఉంటుంది… బాక్సులు లేకపోతే బతుకు బస్టాండే..