Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

|

Apr 22, 2021 | 2:32 PM

ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. వీటిపై యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు...

Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!
Boyfriend
Follow us on

ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. వీటిపై యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తమకు నచ్చిన భాగస్వామిని వెతుక్కునేందుకు పలు రకాల డేటింగ్ యాప్స్ లో సెర్చింగ్ చేస్తున్నారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ స్టెప్ డేటింగ్. అయితే మీరు ఎప్పుడైనా ఒకేసారి 16 మంది అబ్బాయిలతో అమ్మాయి డేట్ చేయడం చూశారా.? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా.. ఆ పదహారు మంది అబ్బాయిలలో ఒకరు తనకు జరిగిన వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

”డేటింగ్ యాప్ ‘Hinge’ ద్వారా ఓ అమ్మాయితో కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇద్దరం కలుసుకోవాలని అనుకున్నాం. దాని కోసం ప్లాన్స్ కూడా వేసుకున్నాం. ఇద్దరూ కలుసుకునేందుకు తగిన సమయం, స్పాట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నామని” సదరు వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఇంతవరకు అంతా బాగున్నా..ఆ స్పాట్ కి వెళ్లాక అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

అక్కడ మరో 15 మంది క్యూ లైన్ లో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వారెవరని ఆరా తీయగా.. తనలాగే ఆ అమ్మాయి డేట్ కి పిలిస్తే వచ్చినట్లుగా అతడికి తెలిసింది. ఇక కొద్దిసేపటి తర్వాత సదరు అమ్మాయి అక్కడికి తన ఫ్రెండ్ తో కలిసి వచ్చింది. చిన్నపాటి ప్రసంగం ఇచ్చినట్లు.. ”డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మీ అందరినీ ఒకే వేదికపైకి పిలిచాను. మీరందరూ ఒకరినొకరు తెలుసుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నా” అని పేర్కొంది. అక్కడ ఉన్నవాళ్లు కొంతమంది ఆ అమ్మాయికి పలు ప్రశ్నలు సంధించినా.. ఆమె జవాబివ్వలేదు.

dating

Read also:

Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!

అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి… ఇరుక్కుపోయింది.!