Viral Video: సోషల్ మీడియాలో కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోల్లో ఈ రెండు జంతువులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటుండగా, మరికొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వుకునేలా, ఫన్నీగా ఉంటాయి. కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండింటికీ భిన్నమైన, ఆశ్చర్యకరమైన, అబ్బుపరిచే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కుక్క, పిల్లి మధ్య శత్రుత్వం ఉంటుంది. కానీ, కాలం మారుతున్నట్లుగానే.. వాటి మధ్య వైరం కూడా మారి.. స్నేహ బంధంగా మారుతోంది.
పిల్లి కనిపిస్తే చాలు అటాక్ చేసే కుక్కలను మనం చూశాం. కానీ, పిల్లి ప్రాణాపాయంలో చిక్కుకుంటే.. ఏమాత్రం ఆలోచించకుడా, ప్రాణాలకు తెగించి మరీ కుక్కను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. అవును, తాజా వైరల్ వీడియోలో చెరువులో పడి పిల్లి మునిగిపోతుంటుంది. ఇది గమనించిన కుక్క.. చలించిపోయింది. ఆ పిల్లిని కాపాడేందుక నీటిలోకి దూకేసింది. మునిగిపోతున్న పిల్లిని తన వీపుపై కూర్చోబెట్టుకుని బయటకు తీసుకువచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. కుక్కను భయపడిందో ఏమో గానీ.. ఒడ్డుకు వచ్చిన తరువాత ఆ పిల్లి.. తనను కాపాడిన కుక్క మొహం కూడా చూడకుండా త్వరత్వరగా జారుకుంది.
కాగా, కుక్క హెల్పింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్ అంతా కెమెరాలో రికార్డ్ చేసి.. ఆ వీడియోను @Happydog అనే ఖాతా ద్వారా Twitterలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 17 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు. వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
Good job doggy ? We are proud of you ?? pic.twitter.com/ZYViUIcsxR
— Happy Dog (@Happydog___) July 20, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..