సాధారణంగా మనం షాపింగ్‌కు వెళ్లినా.. ఆఫీసుకు వెళ్లినా మన వాహనాలను పార్క్ చేయడం చాలా కష్టం. వాహనాలకు సరిపడా ఖాళీ స్థం దొరక్కా.. నానా ఇబ్బందులు పడుతుంటాము. రోడ్డుపై పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేయడం మరో సమస్యగా ఉంటుంది. అయితే ఇదంతా ..బైక్.. కార్ వంటి వాహనాలకు సంబంధించినది. కానీ ఓ చిన్న సైకిల్ పార్క్ చేయడానికి కారు పట్టేంత స్థలాన్ని ఆక్రమించేశాడు ఓ చిన్నోడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో.. ఓ షాపింగ్ పార్కింగ్ ఏరియాలో కార్లన్ని పార్క్ చేసి ఉన్నాయి. అయితే ఓ చోట మరో కారు పార్క్ చేసేంత స్థలం ఉంది. వెంటనే అక్కడకు ఓ వ్యక్తి తన కారు పార్క్ చేయడానికి వచ్చాడు.. కానీ ఆలోపే.. ఓ ఆరెళ్ల కుర్రాడు.. తన చిన్న సైకిల్‌ను పార్క్ చేస్తూ కనిపించాడు. కారు పార్క్ చేయడానికి వస్తున్నా.. అదేం పట్టించుకోకుండా… తన సైకిల్ పార్క్ చేసి దర్జాగా వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Little boy found the best spot to park his bike.. ? pic.twitter.com/ow12Lg7fD0
— Buitengebieden (@buitengebieden_) March 2, 2022
Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..
Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..
మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..