Viral video: సుడి బాగుండి బచాయించాడు కానీ.. ఫ్లై ఓవర్‌ గోడను ఢీకొట్టిన బైకర్‌. షాకింగ్ వీడియో..

అయితే ఈ భూమిపై నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగినా రెప్పపాటులో అయినా తప్పించుకుంటారు. నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. సోషల్‌ మీడియా విస్తృతి పెరగడం, ప్రతీ చోట సీసీ టీవీ కెమెరాలు ఉండడం, ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్‌ ఉండడంతో ఇలాంటి ఎన్నో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇట్టే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో...

Viral video: సుడి బాగుండి బచాయించాడు కానీ.. ఫ్లై ఓవర్‌ గోడను ఢీకొట్టిన బైకర్‌. షాకింగ్ వీడియో..
Bike Viral Video

Updated on: Oct 09, 2023 | 7:27 PM

వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు ఎంత చెబుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యం కారణంగా చనిపోతున్న వారికంటే ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువనే గణంకాలు భయపెడుతున్నాయి. చిన్నచిన్న పొరపాట్లే ప్రమాదాలకు కారణంగా మారుతుంటాయి. త్వరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఆతృత, ఆలస్యంగా ప్రయాణం మొదలు పెట్టడం ఇలా కారణం ఏదైనా ప్రతీ రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ భూమిపై నూకలు మిగిలి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగినా రెప్పపాటులో అయినా తప్పించుకుంటారు. నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఉదాహరణలు దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. సోషల్‌ మీడియా విస్తృతి పెరగడం, ప్రతీ చోట సీసీ టీవీ కెమెరాలు ఉండడం, ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్‌ ఉండడంతో ఇలాంటి ఎన్నో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఇట్టే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదృష్టం బాగుంటే, ఎంతటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయట పడొచ్చని చెబుతోన్న ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఈ సంఘటన గుజరాత్‌లోని సూర్‌త్‌లో జరిగింది. సూరత్‌ పట్టణంలోని ఓ ఫ్లై ఓవర్‌పై యువకుడు బైక్‌పై వేగంగా వెళుతున్నాడు. ఇదే సమయంలో ముందున్న కారును ఓవర్‌టేక్‌ చేసిన సదరు కుర్రాడు రోడ్డుకు అవతలి వైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే బైక్‌ మితిమీరిన వేగంతో ఉండడం, బైక్‌ను కంట్రోల్‌ చేయకలేకపోవడంతో ఫ్లైఓవర్‌ డివైర్‌ను ఢీకొట్టాడు. ఆ ధాటికి ఫ్లైఓవర్‌ గోడపై ఒక్కసారిగా పడ్డాడు.

వైరల్ వీడియో..

అయితే అదృష్టవశాత్తూ ఆ కుర్రాడు గోడ లోపలివైపు, ఫ్లైఓవర్‌ రోడ్డుపైనే పడ్డాడు. అయితే యువకుడు రోడ్డుపై పడ్డా బైక్‌ మాత్రం కొంత దూరం అలాగే ప్రయాణించింది. బైక్‌ ఇంకొచెం వేగంతో ఉన్నా ఆ యువకుడు ముమ్మాటికీ ఫ్లై ఓవర్‌ పై నుంచి కింద పడిపోయేవాడు. అయితే అదృష్టం బాగుండడంతో చిన్న గాయం కూడా కాకుండా బచాయించాడు. దీనంతటినీ వెనకాల కారులో వస్తున్న వ్యక్తి రికార్డ్ చేశాడు. ఈ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వేగం కన్నా ప్రాణం మిన్న అని ఇందుకే అంటారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..