Beautiful Sunset Video: ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానం.. డోర్‌ తెరిచి చూడగానే అద్భుతం కనిపించింది..అది చూస్తేగానీ నమ్మలేరు..?

|

Mar 20, 2024 | 6:25 PM

ఈ వీడియోలో మీరు సూర్యాస్తమయం హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూస్తారు. ఈ వీడియో నిజానికి మెక్సికోకు చెందినది. వీడియో చూస్తుంటే ఆకాశానికి ఎవరో నారింజ, గులాబీ, పసుపు రంగులు అద్దినట్టుగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అందమైన కాన్వాస్ పెయింటింగ్‌ లాగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా చూస్తూనే ఉండిపోతారు..

Beautiful Sunset Video: ఎయిర్‌పోర్టులో ల్యాండైన విమానం.. డోర్‌ తెరిచి చూడగానే అద్భుతం కనిపించింది..అది చూస్తేగానీ నమ్మలేరు..?
Beautiful Sunset
Follow us on

ప్రకృతిని మించిన అద్భుతం మరోకటి లేదు. ప్రకృతి తన రూపాలన్నిటినీ మనుషులైన మనకు చూపిస్తుంది. కొన్నిసార్లు దాని విశ్వరూప భారాన్ని మనం భరించవలసి ఉంటుంది. కొన్నిసార్లు ప్రకృతి దాని అందమైన రూపాన్ని చూపుతుంది. ఆ దృశ్యాలు మన హృదయాలను కట్టిపడేస్తుంటాయి. అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు సూర్యాస్తమయం హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూస్తారు. ఈ వీడియో నిజానికి మెక్సికోకు చెందినది. వీడియో చూస్తుంటే ఆకాశానికి ఎవరో నారింజ, గులాబీ, పసుపు రంగులు అద్దినట్టుగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా అందమైన కాన్వాస్ పెయింటింగ్‌ లాగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఈ దృశ్యాన్ని చూస్తే.. అలా చూస్తూనే ఉండిపోతారు..

వైరల్‌ అవుతున్న ఈ వీడియో X హ్యాండిల్ @gunsnrosesgirl3లో షేర్‌ చేయబడింది. ఫ్లైట్ అటెండెంట్లు విమానం డోర్లు తెరిచే సమయానికి బయట సూర్యాస్తమయం అవుతున్నట్లు వీడియోలో మీరు చూస్తారు. ఈ ప్రయాణంతో సూర్యుడు కూడా భూమిపైకి దిగివచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆకాశం నుండి భూమి వరకు అంతా నారింజ రంగు కమ్మేసుకుంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోకు ఇప్పటికే 22.5 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ప్రజలు కూడా ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై అద్భుతం, అందమైన ప్రకృతి అద్భుతం వంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దృశ్యం మెక్సికోలో తరచుగా కనిపిస్తోందని చాలా మంది అంటున్నారు.

వీడియో చూసిన వారిలో ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – మెక్సికో సూర్యాస్తమయం ప్రకృతి రమణీయం. ఆకాశంలో కనిపించే రంగులు మంత్రముగ్ధులను చేస్తాయి. నేను ముందు నుండి చూడాలనుకుంటున్నాను. ఇంకో యూజర్ ఇలా వ్రాశారు – ఇది చూస్తే మీరు అంగారక గ్రహంపైకి దిగినట్లు అనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..