West Godavari: ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం

|

May 05, 2022 | 10:15 AM

West Godavari: ఏడుపదుల వయస్సులోనూ బామ్మ గారు భక్తి పారవశ్యం తో ఊరేగింపులో చెంగు చెంగున చేసిన నృత్యం ను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు అయితే ఆమె నృత్యానికి..

West Godavari: ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం
Bamma Dance
Follow us on

West Godavari: ఏడుపదుల వయస్సులోనూ బామ్మ గారు భక్తి పారవశ్యం తో ఊరేగింపులో చెంగు చెంగున చేసిన నృత్యం ను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు అయితే ఆమె నృత్యానికి ముగ్ధులు అయ్యి చప్పట్లు కొడుతూ బామ్మ గారిని ఎంకరేజ్ చేశారు. ఈ అందమైన దృశ్యం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari)  రామానుజులాచార్యులు (Ramanujalacharya) వారి రధోత్సవం సందర్భంగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని నరసాపురం లో శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి కోవెల లో శ్రీ రామానుజులాచార్యుల వారి తీరు నక్షత్ర ఉత్సవాలు ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రామానుజులాచార్యులు వారి రధోత్సవం కొనసాగింది. ఈ రధోత్సవం కార్యక్రమానికి రాష్ట్రం లోని వివిధ ప్రదేశాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. రాజమండ్రికి చెందిన రామానుజుల వారి భక్తురాలు ఎం.చూడామణి పాల్గొని స్వామి రథం ముందు భక్తి పారవశ్యంతో నాట్యం చేస్తూ ఊరేగారు. బామ్మ గారు ఎంతో ఉత్సాహంగా చేసిన నృత్యం చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బామ్మ గారు ఏడు పదుల వయస్సు లోనూ చేస్తున్న నృత్యం చూసి ఉత్సాహం తో అక్కడి భక్తులకు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు. దీంతో బామ్మ గారు మరింత ఉత్సాహంగా నృత్యం చేశారు.

 

Reporter : B. Ravi Kumar,TV9 Telugu

Also Read: Hyderabad: భాగ్యనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ టికెట్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి అమల్లోకి

Ramanujacharyulu: నేటి నుంచి 5 రోజుల పాటు రామానుజుల జయంతోత్సవాలు.. చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో విశేష కైంకర్యాలు