Healthy Relationship: జీవితంలో అత్యంత ముఖ్యమైన సంబంధాలు నమ్మకం, ప్రేమపై నిర్మితమై ఉంటాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం విడదీయరానిది. భావోద్వేగ బంధానికి అతీతమైన సంబంధం. పిల్లలు ఏ వయసులోనైనా తమ తల్లిదండ్రుల కోసం చూస్తారు. ఆ కారణంగా.. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్గదర్శకులుగా ఉండేందుకు ప్రయత్నించాలి. అదే వారికి మీరందించే వారసత్వం. పిల్లలు సాధారణంగానే తమ తల్లిదండ్రుల సపోర్ట్, ప్రేమ, అప్యాయత, రక్షణను కోరుకుంటారు. అందుకే.. మీ పిల్లలతో సాధ్యమైనంత వరకు సరదాగా గడపండి. వారితో సంతోషంగా ఉండండి. పిల్లలతో ఆరోగ్యకరమైన సంబంధానికి ఈ 5 ప్రాథమిక అంశాలను పాటించాలి.
ప్రేమను వ్యక్తం చేయాలి..
మనం ఎంతగా ప్రేమిస్తున్నామో పిల్లలకు తెలుసు అని మనం తరచుగా అనుకుంటాం. కానీ, అది వాస్తవం కాదు. మన ప్రేమను వారు ఆస్వాధించేలా చూపాలి. ప్రేక, అప్యాయత, వారిపట్ల మనకున్న శ్రద్ధ పిల్లలకు అర్థమయ్యేలా ఎక్స్‌ప్రెస్ చేయాలి. మీ ప్రేమను నేరుగా వారితోనే వ్యక్తపరచండి. ‘ఐ లవ్ యూ’ అని తరచుగా వారితో చెప్పండి. వారిని ఒడిలోకి తీసుకుని అప్యాయత చూపండి.
పిల్లలతో బాగా మాట్లాడాలి..
మీరు మీ పిల్లలతో బాగా కమ్యూనికేట్ చేస్తున్నారా? లేదా అని చూసుకోవాలి. పిల్లల ఎదుగుదలకు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఫలితంగా పిల్లలు వ్యక్తీకరణ, కమ్యూనికేషన్, నిజాయితీ ఆధారంగా సంబంధాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటారు. అలాగే, వారి భావాలను గుర్తించండి. వారి అభిప్రాయాలను వినాలి. వారు చెప్పే విషయాల్లో ఎంత మేరకు నిజాలు ఉన్నాయి, ఏది అర్థవంతమైనది అనే వివరాలు వారికి తెలియజేయండి.
సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించండి..
తల్లిదండ్రులుగా.. మీరు మీ పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించారు. పిల్లలు అలాంటి వాతావరణంలో తాము సేఫ్ అని భావిస్తుంటారు. తమ పట్ల శ్రద్ధ తీసుకున్నట్లుగా భావిస్తారు. అలాగే వారి అవసరాలు ఏంటనేవి కూడా తెలుసుకోగలుగుతారు.
వారు చెప్పేది ఓపికగా వినండి..
తల్లిదండ్రులు, పిల్లల మధ్య బందం బలపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది ‘ఓపిక’, ‘సహనం’. వీలైనంత వరకు వారితో ఉండండి. వారు చెప్పేది ఓపికగా వినండి. వారితో సహనంతో మాట్లాడండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. వారి కోసం కొంత సమయాన్ని కేటాయించండి.
పిల్లలతో కలిసి తినండి..
జీరో డిస్ట్రాక్షన్‌తో మీ పిల్లలతో మీ రోజులో కనీసం 30 60 నిమిషాలు గడిపేందుకు షెడ్యూల్‌ను రూపొందించుకోండి. మీ పిల్లలతో కలిసి ఉండటానికి, వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కలిసి తినడం మరొక మార్గం. భోజనం సమయంలో మంచి కుటుంబ సంభాషణ జరగవచ్చు. వారి పరికరాలను దూరంగా ఉంచడానికి, నిజ సమయంలో కుటుంబంగా చేరడానికి వారిని ప్రోత్సహించండి.
Also read:
Astro Remedies of Salt: ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీ అదృష్టాన్ని పెంచుతుంది.. అదెలాగో మీకు తెలుసా?..
Telangana: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ హాల్ టికెట్స్..
Hyderabad: ‘అయ్యాయో వద్దమ్మా’ శరత్ ని చితక బాదారా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..