
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం.. ఒక్కోసారి నిరుపేదలు సైతం ఉన్నట్లుండి కోటీశ్వరులు అవుతారు. అది చూసి అలా ఎలా జరిగిందని అంతా షాక్ అవుతుంటాం.. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. బుర్హాన్‌పూర్‌కు చెందిన ఒక కుటుంబంలో కేలం ఆరు గంటల్లోనే అద్భుతం జరిగింది. దీనికంతటికీ కారణం వారి ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారి మేధాంష్ రైక్వార్. మేధాంష్ తన కుటుంబాన్ని రాత్రికి రాత్రే లక్షాధికారులను చేశాడు. కేవలం రూ.201 ఖర్చుతో అతని కుటుంబం ఏకంగా రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారును గెలుచుకుంది. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందానికి అవథులు లేవు.
బర్హాన్‌పూర్‌లోని శిలాంపుర ప్రాంతానికి చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ.. సర్కార్ ధామ్ ఆధ్వర్యంలో అభాపురిలో జరిగిన గర్బా ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ ఆమె తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరు మీద రూ. 201 చెల్లించి ఒక ప్రైజ్ కూపన్ కొనుగోలు చేశారు. మరుసటి రోజు నిర్వాహకులు నిర్వహించిన లక్కీ డ్రాలో మేధాన్ష్ పేరు మీద కొన్న కూపన్‌కే బహుమతిగా ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కారు దక్కింది. ఈ విషయం తెలిసి రాయిక్వార్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. తన మనవడికి బొమ్మల కార్లంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ ఆడుకోవడానికి బొమ్మ కార్లనే అడుగుతాడని, అలాంటిది ఈసారి ఏకంగా నిజమైన లగ్జరీ కారుకే యజమాని అయ్యాడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
డాక్యుమెంట్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే కారు తమ ఇంటికి వస్తుందని, కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నామని కిరణ్ రాయిక్వార్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత చుట్టుపక్కల వారంతా మేధాన్ష్‌ను లక్కీ బాయ్ అని పిలుస్తున్నారని ఆమె ఆనందంగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో లాటరీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఇలాంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో నిర్వహించే లక్కీ డ్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..