Viral: రూ. 54 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు.. కట్ చేస్తే.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే

|

Sep 07, 2024 | 1:17 PM

మీకే ఏడాదికి ఓ రూ. 54 లక్షలు జీతమిచ్చే ఉద్యోగం ఉంటే.? ఏం చేస్తారు.. ఇదేం క్వశ్చన్ అని అనుకుంటున్నారా.! సరే.. ఆగండి.. ఇక్కడ ఓ వ్యక్తి రూ. 54 లక్షలు జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకుని సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు.

Viral: రూ. 54 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు.. కట్ చేస్తే.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలిస్తే
Trending
Follow us on

మీకే ఏడాదికి ఓ రూ. 54 లక్షలు జీతమిచ్చే ఉద్యోగం ఉంటే.? ఏం చేస్తారు.. ఇదేం క్వశ్చన్ అని అనుకుంటున్నారా.! సరే.. ఆగండి.. ఇక్కడ ఓ వ్యక్తి రూ. 54 లక్షలు జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకుని సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతేకాదు ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. అతడు మరెవరో కాదు పరాంతప్ చౌదరి. ఇంతకీ ఆ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. స్క్వేర్ యార్డ్స్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా 54 లక్షల రూపాయల జీతంతో పని చేసే పరాంతప్ చౌదరి.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఎందుకని అనుకుంటున్నారా.? అతనికి జీవితంలో సంతృప్తి లేదంట. అందుకే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాడు. కోల్పోయిన బంధాలను తిరిగి పునర్నిర్మించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాడు. ఇక నెట్టింట రాజీనామా తర్వాత తన జీవితం ఎలా ఉందో చెబుతూ అతడొక పోస్ట్ చేశాడు. బైజూస్, స్క్వేర్ యార్డ్స్ సంస్థల్లో గత ఏడేళ్లుగా పనిచేశానన్న పరాంతప్ చౌదరి.. సగం సమయం వ్యాపారాన్ని ఎలా నిర్మించాలో నేర్చుకుంటూ.. మిగతా సమయం ప్రణాళికలను అమల్లో చేయడంలో గడిపేశానని చెప్పాడు. అలాగే ఈ ఏడేళ్లలో ఆయా సంస్థలకు రూ.100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చానని చెప్పుకొచ్చాడు. ఇలా ఇన్నేళ్లు చేయడం వల్ల తనకు తెలియకుండానే అలసట వచ్చిందని తెలిపాడు.

ప్రస్తుతం తాను ఫ్రీలాన్సర్‌గా ఇతర సంస్థలకు కూడా సలహాలు ఇస్తున్నట్టు తెలిపాడు. స్టార్టప్‌ల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరికీ అందుబాటులో ఉంటున్నానని పరాంతప్ చౌదరి అన్నాడు. ఒకవేళ తాను ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఉంటే.. ఈ మూడు నెలల్లో రూ.9 లక్షలు సంపాదించేవాడిననీ చెప్పాడు. ప్రస్తుతం అందులో పది శాతం కూడా తాను సంపాదించలేదని.. అయితేనేం మునుపెన్నడూ లేనంతగా తాను జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని.. డబ్బుతో కొన్నింటికి ఎప్పటికీ కొనలేమని తనకు అర్థమైందని చెప్పాడు. కాగా, పరాంతప్ చౌదరి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.