పురావస్తు తవ్వకాల్లో జరుగుతున్న ప్రతీసారి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూ పలు నిధి నిక్షేపాలు బయటపడుతుంటాయి. వాటిని పరిశీలించిగా చూడగా ఏళ్ల నాటి చరిత్రలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన ఇజ్రాయిల్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ కథేంటంటే..?
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ఇజ్రాయిల్ కోస్టల్ ఏరియాలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అక్కడ వారిని ఆశ్చర్యపరుస్తూ 3300 ఏళ్ల నాటి ఓ గుహ బయటపడింది. ఇక అందులో వేల సంఖ్యలో కుండలు, కంచు వస్తువులు, దీపాలు, బాణాలు, ఈటెలు కనిపించాయి. బీచ్‌కు అతి సమీపంలో ఈ తవ్వకాలు జరిపిన స్థలం ఉండగా.. ఈ చారిత్రాత్మిక గుహలో లభించిన వస్తువులన్నీ కూడా 13వ శతాబ్దం, ఈజిప్టు చక్రవర్తి ఫారో రామెసెస్ II కాలం నాటివిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గుహలోని వస్తువుల పరిమాణం చాలా విభిన్నంగా ఉన్నాయని.. చాలా అరుదైన వస్తువులుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే వారికి ఈ కంచు వస్తువులతో పాటు పలు ఆస్థి పంజరాలు కూడా లభ్యమయ్యాయి. అవి యుద్దవీరులు లేదా ఓడ కాపలాదారులకు సంబంధించినవి కావొచ్చునని శాస్త్రవేత్తల అంచనా. కాగా, ఈ గుహ ఆవిష్కరణ అస్సలు నమ్మశక్యం కానిది.. ఇలాంటి గుహాలు ఎప్పుడూ కూడా కనుగొనబడలేదు. 3300 సంవత్సరాలుగా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎవ్వరూ కూడా గుర్తించలేకపోయారని పురావస్తు శాస్త్రవేత్త డేవిడ్ గెల్మాన్ వెల్లడించారు.
Intact burial cave found on the southern Israeli coast, Kibbutz Palmahim, 13th c. BCE, Ramses II. There are pottery and bronze vessels, amphorae, bowls, cooking vessels, oil lamps, arrowheads and spear tips of bronze https://t.co/Ze6szJdjdo
Vídeo: Israel Antiquities Authority pic.twitter.com/SZjbU37F30— Dr. M. Teresa Soria-Trastoy (@arqueoegipto) September 19, 2022
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..