
మెదడు కణతితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి తల్లిదండ్రులు సంతారా ఇప్పించారు. కానీ, దురదృష్టం ఆ చిన్నారిని వెంటాడింది. ఆచారం పూర్తైన కొద్ది నిమిషాలకే ఆ బిడ్డ మరణించింది. సంతారా స్వీకరించిన అతి పిన్న వయస్కురాలిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో ఈ చిన్నారి స్థానం సంపాదించింది. సంతారా అనేది జైన ధర్మంలో ఒక పవిత్ర ఆచారం. గత బుధవారం ఏప్రిల్ 30న జైన సమాజం ఆ చిన్నారి తల్లిదండ్రులను సత్కరించిన సందర్బంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన పీయూష్ జైన్, వర్ష జైన్ దంపతులకు వియానా అనే మూడేళ్ల కూతురు ఉంది. కానీ, ఆ చిన్నారిపట్ల విధి వక్రీకరించింది. వియానా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. వ్యాధి తిరగబెట్టింది. దాంతో తల్లిదండ్రులు చిన్నారికి సంతారా ఇప్పించారు. కానీ, వారిని ఆ దేవుడు కరుణించలేదు.. ఈ ఆచారం స్వీకరించిన కొద్ది సేపటికే వియానా కన్నుమూసింది. సంతారా స్వీకరించిన అతి పిన్న వయస్కురాలిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో వియానా స్థానం సంపాదించింది. ఇంత చిన్న వయసులో సంతార పాడటం ఇదే మొదటిసారి అని, అందుకే ఇది ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో కెక్కింది చిన్నారి వియానా పేరు.
ఐటీ నిపుణులు అయిన పియూష్, వర్ష జైన్ ల ఏకైక కుమార్తె వియానాకు గత డిసెంబర్‌లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొదట ఇండోర్‌లో, తరువాత ముంబైలో చికిత్స అందించారు. అక్కడ జనవరిలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, ఆమె పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఈ క్రమంలోనే మార్చి 21న ఇండోర్‌లోని ఆధ్యాత్మిక జైన గురువు రాజేష్ ముని మహారాజ్‌ను సందర్శించారు. గురూజీ ఆమెను చూసి ఈ రాత్రి బతికి ఉండటం కూడా కష్టమవుతుంది అని చెప్పారట.
ఈ క్రమంలోనే ముని మహారాజ్ భక్తులు 100 కి పైగా సంతార ఆచారంలో పాల్గొన్న దృశ్యాలను వారు చూశారు. దాంతో ఆ కుటుంబం దగ్గరి బంధువులను సంప్రదించి వారి సమ్మతిని తెలిపింది. వారు తమ కుమార్తెను పవిత్ర ప్రమాణం చేయనివ్వాలని నిర్ణయించుకున్నారు. అందరి సమ్మతితో మునిశ్రీ సంతార ప్రక్రియను మతపరమైన మంత్రోచ్ఛారణలు, ఆచారాలతో ప్రారంభించారు. ఈ ఆచారం దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగింది. ఇదంతా పూర్తయిన పది నిమిషాల తర్వాత వియానా ప్రశాంతంగా కన్నుమూసిందని చిన్నారి తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..