ఈ చిత్రం చూశారా సుమీ..? రోజుల వయస్సున్న లేగ దూడ పాలిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బుజ్జి దూడను చూసేందుకు పోటెత్తున్నారు. ఇది ఇప్పుడు అక్కడ సెలబ్రిటీగా మారింది. బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలోని షుకురియా గ్రామంలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. ఆ లేగ దూడ వయస్సు కేవలం 29 రోజులేనట. దేవుడి మహిమ వల్లే ఇలా జరుగుతుందని.. దూడ యజమాని ఉత్తమ్ మొండల్ చెబుతున్నాడు. తన ఇంట్లో శాలిగ్రామ శిల ఉందని.. దాన్ని రోజూ పాలతో అభిషేకించి.. పూజలు చేస్తానని ఆయన బెబుతున్నాడు. దాని ఫలితంగానే ఇప్పుడా దూడ పాలిస్తుందని అంటున్నాడు.
రోజుకు 750 మిల్లీలీటర్లు పాలిస్తున్న ఈ లేగ దూడ.. మరోవైపు తల్లి ఆవు పాలు కూడా తాగుతుంది. అయితే ఈ దూడ పుట్టే సమయంలో చాలా ఇబ్బందులు పడిందట. అప్పుడు దాని బరువు కూడా సాధారణంగా పుట్టే దూడల కంటే కాస్త ఎక్కువ ఉందట. దూడ పుట్టిన 21 రోజుల తర్వాత దానికి పాలిండ్లు పెరగడం గమనించానని మొండల్ వెల్లడించాడు.
ఆ బుజ్జి లేగ దూడ నుంచి పాలు పితుకుతున్న చిత్రాలు ప్రజంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి పశు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాని పాల గ్రంధి హార్మోన్ల అసమతుల్యత కారణంగానే ఇలా జరుగుతుందని మరికొందరు పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దూడ ఇంకా ఎంత కాలం పాలిస్తుంది.. అది ఎదుగుతున్న కొద్దీ ఇచ్చే పాలు పెరుగుతాయా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..