Video: మనిషిని భారీ క్రేన్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లడం ఎప్పుడైనా చూశారా? 273 కేజీల బరువున్న వ్యక్తి..

ఫ్లోరిడాలో ఓ అసాధారణ ఘటన వెలుగులోకి వచ్చింది. 273 కేజీల బరువున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి చేర్చడానికి క్రేన్ ఉపయోగించాల్సి వచ్చింది. అంబులెన్స్‌లో తరలించడం అసాధ్యం కావడంతో, స్థానిక అధికారులు, ఫైర్‌ సిబ్బంది సమన్వయంతో ప్లాన్ చేసి, ఆ భారీకాయుడిని బిల్డింగ్ నుంచి సురక్షితంగా కిందికి దించి, వైద్య సహాయం కోసం తరలించారు.

Video: మనిషిని భారీ క్రేన్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లడం ఎప్పుడైనా చూశారా? 273 కేజీల బరువున్న వ్యక్తి..
Man Weighing Over 273 Kg

Updated on: Oct 09, 2025 | 12:56 PM

ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏకంగా ఓ భారీ క్రేన్‌ వాడారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ అవసరం కానీ క్రేన్‌తో పనేంటీ? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఆ ‍వ్యక్తి ఎంత బరువు ఉన్నాడో తెలుసుకోవాల్సిందే. ఏకంగా 273 కేజీల బరువు ఉన్న వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు క్రేన్‌ వాడాల్సి వచ్చింది.

అతన్ని సాధారణంగా స్ట్రెచర్‌పై పడుకోబెట్టి అతని ప్లాట్‌ నుంచి కింది తీసుకోవరావడం అసాధ్యం. అందుకే స్థానిక అధికారులు, ఫైర్‌ సిబ్బంది అంతా కలిసి ఒక పక్కా ప్లాన్‌ ప్రకారం ఆ భారీకాయుడిని బిల్డింగ్‌ నుంచి కిందికి దింపి, ఆస్పత్రికి తరలించారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. అమెరికాలోని ప్లోరిడాలో జరిగింది. భారీ బరువున్న ఆ వ్యక్తిని అధికారులు ఎంతో శ్రమించి బిల్డింగ్‌ నుంచి కిందికి దించారు. అది చూసేందుకు చుట్టుపక్కల జనమంతా గుమ్మిగూడారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి