Viral: హాయిగా నిద్రపోయింది.. రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.. ఎలాగో తెలిస్తే షాకే.!

|

Sep 06, 2022 | 5:05 PM

నెల జీతం కోసం కంటి నిండా నిద్రలేకుండా కష్టపడుతుంటాం. అయితే ఇక్కడొక యువతి కావల్సినంత సమయాన్ని నిద్రకు వెచ్చించి..

Viral: హాయిగా నిద్రపోయింది.. రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.. ఎలాగో తెలిస్తే షాకే.!
Sleep Internship
Follow us on

నెల జీతం కోసం కంటి నిండా నిద్రలేకుండా కష్టపడుతుంటాం. అయితే ఇక్కడొక యువతి కావల్సినంత సమయాన్ని నిద్రకు వెచ్చించి.. ఏకంగా రూ. 5 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అంతేకాదు ‘భారత తొలి స్లీప్ ఛాంపియన్‌’ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అసలేం చెబుతున్నాం.? నిద్రపోతే లక్షలు గెలవడమేంటి.? ఇంతకీ ఆ పోటీ ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ మ్యాట్రస్ సంస్థ ప్రతీ ఏటా స్లీప్ ఇంటర్న్‌షిప్ అనే పోటీ నిర్వహిస్తోంది. నిద్రను ప్రోత్సహించడంలో భాగంగా వారు ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారు 100 రోజుల పాటు డైలీ 9 గంటల చొప్పున కంటి నిండా నిద్రపోవాలి. చివరి రౌండ్‌కు నలుగురిని ఎంపిక చేసి.. వారి నిద్ర నాణ్యతను బట్టి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.

ఈ క్రమంలోనే గతేడాది నిర్వహించిన పోటీల్లో కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి 95 శాతం స్లీప్ ఎఫిషియెన్సీ స్కోర్‌ సాధించి 5 లక్షల రూపాయలు గెలుచుకుంది. అంతేకాకుండా భారత తొలి స్లీప్ ఛాంపియన్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అలాగే లాస్ట్ రౌండ్‌కు వచ్చిన మిగతా ముగ్గురికి చెరో లక్ష రూపాయలు ఇచ్చారు వేక్‌ఫిట్ సంస్థ నిర్వాహకులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..