Viral: పురాతన భవంతిని కూల్చుతుంటే ఒక్కసారిగా కళ్లు జిగేల్.. ఏంటని చూడగా.!

ఓ ఎన్ఆర్ఐ తన పురాతన భవంతిని కూల్చేందుకు ఒక కాంట్రాక్టర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే ఆ కాంట్రాక్టర్ కొందరు కూలీలను తీసుకుని స్పాట్‌కి వెళ్లి కూల్చివేత పనులు ప్రారంభించాడు. అనుకోకుండా ఆ పనులు జరుగుతోన్న సమయంలో ఒక్కసారిగా వాళ్ల కళ్లకు జిగేల్ అనిపించేలా ఓ దృశ్యం కనిపించింది.

Viral: పురాతన భవంతిని కూల్చుతుంటే ఒక్కసారిగా కళ్లు జిగేల్.. ఏంటని చూడగా.!
Representative Image

Updated on: Jan 02, 2024 | 1:09 PM

ఓ ఎన్ఆర్ఐ తన పురాతన భవంతిని కూల్చేందుకు ఒక కాంట్రాక్టర్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగానే ఆ కాంట్రాక్టర్ కొందరు కూలీలను తీసుకుని స్పాట్‌కి వెళ్లి కూల్చివేత పనులు ప్రారంభించాడు. అనుకోకుండా ఆ పనులు జరుగుతోన్న సమయంలో ఒక్కసారిగా వాళ్ల కళ్లకు జిగేల్ అనిపించేలా ఓ దృశ్యం కనిపించింది. ఏంటని దాని చుట్టుప్రక్కల ఉన్న మట్టి తవ్వి చూశారు. సీన్ కట్ చేస్తే.!

వివరాల్లోకి వెళ్తే.. సుమారు 199 పురాతన బంగారు నాణేలను కాజేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు గుజరాత్ పోలీసులు. నవ్సారి జిల్లాలోని బిలిమోరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రిటన్‌లో నివాసముంటున్న హవాబీన్ బలియా అనే ప్రవాస భారతీయుడు.. స్థానికంగా బజార్ స్ట్రీట్‌లో ఉంటున్న తన పురాతన భవంతి కూల్చివేత పనులను సర్ఫరాజ్‌ కరదియా అనే కాంట్రాక్టరుకు అప్పగించాడు. అతడు మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు కూలీలను పనిలో పెట్టుకున్నాడు. ఇక వారందరికీ ఇల్లు కుల్చుతుండగా.. 1922 సంవత్సరం బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి.

సుమారు 199 పురాతన బంగారు నాణేలను వెలికితీయగా.. వాటిపై కింగ్‌ జార్జ్‌-5 బొమ్మ ముద్రించి ఉంది. సదరు ఓనర్‌కి తెలియకుండా కాంట్రాక్టర్, ఆ నలుగురు కూలీలు ఈ బంగారు నాణేలను దొంగలించారు. వాటి విలువ దాదాపుగా రూ. 92 లక్షలు ఉంటుందని అంచనా. గతేడాది అక్టోబర్ 21న బలియా ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. తాజాగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు సమయంలో తమ దగ్గర నుంచి కొన్ని నాణేలను మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు పోలీసులు తీసుకున్నారని ఓ కూలీ ఫిర్యాదు చేయడంతో.. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఖాకీలు.